ETV Bharat / business

ఒత్తిడిలోనూ బుల్​ జోరు.. సెన్సెక్స్ 420 ప్లస్​ - బిజినెస్ వార్తలు

దేశీయంగా ప్రతికూల పవానాలున్నా స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ సానుకూలతల దన్నుతో సెన్సెక్స్ 428 పాయింట్లు పుంజుకుని తిరిగి 41 వేల మార్క్​ను అందుకుంది. నిఫ్టీ 115 పాయింట్లు బలపడి.. 12 వేల స్థాయిని దాటింది.

STOCKS
స్టాక్​ మార్కెట్లు
author img

By

Published : Dec 13, 2019, 3:58 PM IST

స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ముగిశాయి. నవంబర్​లో రిటైల్ ద్రవ్యోల్బణం మూడేళ్ల గరిష్ఠానికి చేరడం, అక్టోబర్​లో పారిశ్రామికోత్పత్తి భారీగా క్షీణించడం వంటి ప్రతికూలతలున్నా మార్కెట్లు ముందుకే దూసుకుపోవడం గమనార్హం.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 428 పాయింట్లు పుంజుకుంది.. చివరకు 41,010 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 115 పాయింట్ల లాభంతో తిరిగి 12,087 వద్దకు చేరింది.

లాభాలకు కారణాలివే..

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధానికి తాత్కాలికంగా తెరపడనుందన్న అంచనాలు అంతర్జాతీయంగా సానుకూలతలు పెంచాయి. 'చైనాతో అతి పెద్ద డీల్‌కు చాలా దగ్గరగా ఉన్నాం' అని ట్రంప్‌ ట్వీట్​ చేయడం ఈ సానుకూలతలకు ప్రధాన కారణం.

బ్రిటన్ ప్రధానిగా బోరిస్​ జాన్సన్​ మరో సారి విజయం సాధించిన కారణంగా.. ఐరోపా సమాఖ్య​ నుంచి యూకే​ బయటకు రావడం ఖాయమైనట్లు అంచనాలు ఊపందుకున్నాయి. ఈ అంశాలన్నింటితో మదుపరుల సెంటిమెంట్​ బలపడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు.

ఇంట్రాడే సాగిందిలా..

సెన్సెక్స్​ 41,055 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 40,737 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 12,099 పాయింట్ల అత్యధిక స్థాయి.. 12,024 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

యాక్సిస్ బ్యాంక్ 4.21 శాతం, వేదాంత 3.75 శాతం, ఎస్​బీఐ 3.39 శాతం, మారుతీ 3.20 శాతం, ఇండస్​ఇండ్​ బ్యాంక్​ 3.07 శాతం లాభాలను ఆర్జించాయి.

భారతీ ఎయిర్​టెల్​ 1.98 శాతం, కోటక్​ బ్యాంక్​ 1.38 శాతం, బజాజ్​ ఆటో 0.88 శాతం, ఏషియన్​ పెయింట్స్ 0.31 శాతం, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​ 0.05 శాతం నష్టాలను నమోదు చేశాయి.

ఇదీ చూడండి:గుడ్​ న్యూస్​: బ్రాండెడ్ కార్లపై బంపర్​ ఆఫర్స్​!

RESTRICTION SUMMARY: AP CLIENT ONLY
SHOTLIST:
TWITTER @realDonaldTrump - AP CLIENTS ONLY
Internet - 13 December 2019
1. SCREENGRAB of US President Donald Trump's Twitter page, reading (English):  
"Congratulations to Boris Johnson on his great WIN! Britain and the United States will now be free to strike a massive new Trade Deal after BREXIT. This deal has the potential to be far bigger and more lucrative than any deal that could be made with the E.U. Celebrate Boris!"
2. SCREENGRAB of US President Donald Trump's Twitter page, reading (English):  
"Looking like a big win for Boris in the U.K.!"
STORYLINE:
US President Donald Trump congratulated Britain's Prime Minster Boris Johnson on Friday on his victory in the the UK general election.
"Great WIN", he tweeted, adding that the two countries would now be free to strike a
"massive" trade deal.
Trump said it had the potential to be "far bigger and more lucrative than any deal that could be made with the European Union."
Johnson’s Conservative Party won a solid majority of seats in Britain's Parliament - a decisive outcome to a Brexit-dominated election that should allow him to fulfill his plan to take the U.K. out of the European Union next month.
With 640 of the 650 results declared, the Conservatives had 358 seats compared with Labour 202.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.