ETV Bharat / business

వారాంతంలో సూచీలపై అమ్మకాల ఒత్తిడి - sensex

స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ, దేశీయ ప్రతికూలతతో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపుతున్నారు. సెన్సెక్స్​ 136 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 48 పాయింట్లు తగ్గింది.

స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 14, 2019, 9:55 AM IST

వారంలో చివరి సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి స్టాక్​ మార్కెట్లు. బ్యాంకింగ్​, వాహన రంగాలు ప్రధానంగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.

నేడు టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో మదుపరులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ భయాలు కూడా మదుపరుల సెంటిమెంట్​ను ప్రభావితం చేస్తున్నాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 136 పాయింట్లు కోల్పోయింది. ప్రస్తుతం 39,605 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 11,866 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

లాభనష్టాల్లోనివివే..

పవర్ గ్రిడ్​, వేదాంత, ఓఎన్​జీసీ, ఎన్​టీపీసీ, హెచ్​యూఎల్​, మారుతి, కోల్​ ఇండియా, బజాజ్ ఫినాన్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఎల్​ & టీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

ఇండస్ఇండ్​ బ్యాంకు, ఎస్​ బ్యాంక్​, కోటక్ బ్యాంకు, టాటా మోటార్స్​, ఎం&ఎం, ఎస్​బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

ఇదీ చూడండి: ఫోర్బ్స్​ జాబితాలో రిలయన్స్​​, హెచ్​డీఎఫ్​సీ..

Intro:Body:

op

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.