వరుస సెషన్లలో రికార్డు స్థాయి లాభాల తర్వాత... స్టాక్ మార్కెట్లలో కాస్త జోరు తగ్గింది. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 50 పాయింట్ల లాభంతో.. ప్రస్తుతం 39,145 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 11 వేల 600 వద్ద ఫ్లాట్గా ట్రేడవుతోంది.
వాహన, ఐటీ రంగాల్లో సానుకూలతలు ఉన్నా..... మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడమే సూచీలు కాస్త నెమ్మదించడానికి కారణం.
లాభనష్టాల్లోనివివే..
మారుతీ, రిలయన్స్, ఓఎన్జీసీ, ఎం&ఎం, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్ షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.
బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, ఎల్&టీ, పవర్ గ్రిడ్, షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.