ETV Bharat / business

పద్దు 2019: అంకురాల ఆశలు నెరవేరేనా? - అంకురాలు

అంకురాలకు ఏంజెల్‌ పన్ను మినహాయింపు పరిమితి పెంపు... ఎన్నికల ముందు ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. వీటితో పాటు 'స్టార్టప్‌ ఇండియా' లాంటి కార్యక్రమాలను ఎన్డీఏ 1.0 హయాంలో ప్రారంభించారు. ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పటికీ అంకురాలు ఇంకా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్నాయన్నది నిపుణుల అభిప్రాయం. అవేంటి? రేపు ప్రవేశపెట్టనున్న బడ్జెట్​లో అంకుర సంస్థలు ఏం కోరుకుంటున్నాయి?

అంకురాల ఆశలు నెరవేరేనా?
author img

By

Published : Jul 4, 2019, 3:08 PM IST

Updated : Jul 4, 2019, 4:32 PM IST

అంకురాల ఆశలు నెరవేరేనా?

దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్​కు ఆవిష్కరణలు కీలకం. ఇవి సాంకేతికత పరంగా దేశాన్ని మరోస్థాయికి తీసుకెళ్లగలవు. ఈ లక్ష్య సాధనలో అంకురాలు వేగంగా కృషి చేస్తున్నాయి. ఈ ప్రయత్నానికి ప్రభుత్వ అండ తోడైతే విజయం మరింత తొందరగా చేరువవుతుందనేది అంకురాల అభిప్రాయం.

మరిన్ని సంస్కరణలు అవసరం...

ముఖ్యంగా నరేంద్ర మోదీ 1.0 ప్రభుత్వం అంకురాల కోసం స్టార్టప్​ ఇండియా, స్టాండప్​ ఇండియా లాంటి పథకాలను ప్రారంభించింది. వీటితో పాటు అంకురాలు ఎంతో కాలంగా ఎదుర్కొంటున్న పన్ను సమస్య నుంచి ఎన్నికల ముందు కొంత మేర ఉపశమనం కల్పించింది కేంద్రం. అయితే మోదీ 2.0 ప్రభుత్వంలో మరిన్ని ప్రోత్సాహకాలు అవసరమని అంకుర సంస్థల నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం పన్నులు, నగదు లభ్యత సహా అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న అంకుర సంస్థలకు ప్రోత్సాహమందించాలని అంటున్నారు నిపుణులు. ఈ మేరకు కేంద్రం ప్రవేశపెట్టనున్న బడ్జెట్​లో అంకురాలకు ఊతమందించే నిర్ణయాలు ఉండొచ్చని ఆశిస్తున్నారు.

లిస్టింగ్‌ ప్రక్రియ సడలించాలి...

అంకురాల్లో నిధుల ప్రవాహానికి స్టాక్‌ మార్కెట్‌లలో 'లిస్టింగ్‌' అనేది ఒక మార్గం. అయితే ఈ ప్రక్రియను అంకురాలకు సడలించాలని నిపుణులు కోరుతున్నారు. పెద్ద సంస్థలకు ఉన్న నిబంధనలను అంకురాలకు వర్తించటం సరికాదన్నది వారి వి‌శ్లేషణ. ఇటీవల హైదరాబాద్‌లోని 25 స్టార్టప్‌ల గురించి పుస్తకాన్ని విడుదల చేసిన ఔత్సాహిక పారిశ్రామిక వేత్త ఎన్‌. రాజ్‌ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"లిస్టింగ్‌ అర్హతను అంకురాలకు సడలించాలి. వెంచర్‌ క్యాపిటల్‌ ఫండ్ల రూపంలో పెట్టుబడులు పొందిన వాటిని అనుమతించాలి. లాభాలు ఉండాలన్న అర్హత నిబంధనను తీసివేయాలి. ప్రస్తుతం లిస్టవ్వటానికి కనీసం మూడు సంవత్సరాలు లాభాల్లో ఉండాలని నిబంధన ఉంది. ఇది తీసివేసినట్లయితే అంకురాలు లిస్టవ్వటానికి ఊతమిచ్చినవారవుతారు. ఎక్కువ మంది వారి షేర్లు కొనేందుకు మొగ్గు చూపుతారు." --- రాజ్‌ ఎన్, 'మేడ్‌ ఇన్‌ హైదరాబాద్‌' పుస్తక రచయిత

కొన్ని సంవత్సరాల క్రితం తయారీ రంగ పరిశ్రమలకు పన్ను మినహాయింపు ఇచ్చారు. ఇలాంటి పన్ను ప్రోత్సాహకాలు అంకురాలకు కూడా అందించాలని రాజ్‌ కోరుతున్నారు.

ఏంజెల్‌ పన్ను రద్దు...

ఏంజెల్‌ పన్నుకు సంబంధించి ఎన్నికల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆ సమయంలో పన్ను మిహాయింపును రూ. 25 కోట్లకు పెంచింది. దీనితో దాదాపు ఈ పన్ను భారం తగ్గిపోయింది. ప్రస్తుత బడ్జెట్‌లో ఈ పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని హైదారాబాద్‌లోని ప్రఖ్యాత 'ఎన్‌బీఎఫ్‌సీ స్టార్టప్‌ ఎనీ టైమ్ లోన్‌' వ్యవస్థాపక సీఈఓ కేకే జేన్‌ కోరారు. ఏంజెల్‌ పన్ను విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

"ఇది అప్పుడే పుట్టిన శిశువును ఐసీయూలో పెట్టిన పరిస్థితి లాంటిది. ఒకవేళ శిశువు మరణించినట్లయితే.. ఆ శిశువును కాపాడేందుకు ప్రయత్నించిన డాక్టర్‌కు శిక్ష వేయకూడదు. ఐసీయూలో ఉన్న శిశువును కాపాడేందుకు ప్రయత్నిస్తూ.. డాక్టర్‌ కూడా రిస్కు తీసుకుంటున్నారు. ఇప్పుడు ఏ డాక్టర్‌ రాడు, శిశువును రక్షించరు. కాబట్టి ఏంజెల్‌ పన్నును రద్దు చేయాలి" --- కేకే జేన్‌, ఎనీటైమ్‌ లోన్‌

సంక్లిష్టమైన ప్రకియ...

అంకురాల రిజిస్ట్రేషన్‌తో పాటు వాటి కార్యకలాపాలు నిర్వహించటానికి చాలా క్షిష్టమైన ప్రక్రియ మనదేశంలో ఉందనేది జౌత్సాహిక పారిశ్రామికవేత్తల అభిప్రాయం. పీఎఫ్‌, టీడీఎస్‌ తదితర కాంప్లియాన్సస్‌ కోసం విలువైన సమయాన్ని అంకురాలు కోల్పోతున్నాయి. కాబట్టి అంకురాలకు సంబంధించి నిబంధనలు సడలించాలని కోరుతున్నారు.

"ప్రస్తుతం మనదేశంలో కేంద్రం, రాష్ట్ర స్థాయిలో అనేక నిబంధనలు ఉన్నాయి. వచ్చే 5-7 సంవత్సరాల వరకు అంకురాలకు సంబంధించి ఎలాంటి కాంప్లియాన్సస్‌ లేకుండా ఓ విధానం తీసుకురావాలి. కేవలం పన్నుల చెల్లిస్తే సరిపోయేలా ఉండాలి." --- కేకే జేన్‌, ఎనీటైమ్‌ లోన్‌

Puri (Odisha), July 04 (ANI): Much awaited Jagannath Rath Yatra celebrations has finally begun in Odisha's Puri on Thursday. The celebrations began at the Jagannath Temple in Puri. Large number of devotees has gathered in Puri to witness the yatra. Jagannath Rath Yatra is one of the oldest public processions in a chariot, celebrated in India.
Last Updated : Jul 4, 2019, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.