దేశీయ విమానయాన సంస్థలు ఇండిగో, స్పైస్‌జెట్‌లు భారీ డిస్కౌంట్ ఆఫర్లను తీసుకువచ్చాయి. ఇందులో భాగంగా దేశీయ, అంతర్జాతీయ గమ్య స్థానాలకు తక్కువ ధరలోనే ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నాయి.
స్పైస్‌జెట్ "దేశ్ విదేశ్ ఘుమొ సేల్"
స్పైస్‌జెట్ ఆఫర్లో భాగంగా దేశీయ ప్రయాణాలకు రూ.1,299 ప్రారంభ ధరగా, అంతర్జాతీయ ప్రయాణాలకు రూ.3,999 ప్రారంభ ధరలను అందుబాటులోకి తెచ్చింది స్పైస్‌జెట్.
ఈ ఆఫర్ ఆగస్టు 30న ముగియనుంది. ఆఫర్ కింద టికెట్ తీసుకున్న వినియోగదారులు 2020 మార్చి 31లోపు ఏదైనా ఒక రోజును ప్రయాణ తేదిగా ఎంచుకోవచ్చు.
ఇండిగో ఆఫర్
ఇండిగో విమానంలో దేశీయ గమ్యస్థానాలకు టికెట్ ధరలు రూ.1,298 నుంచి ప్రారంభం కానున్నాయి. అంతర్జాతీయ గమ్య స్థానాలకు రూ.3,999 ప్రారంభ ధరతో ప్రత్యేక ఆఫర్‌ను తీసుకువచ్చింది.
ఇండిగో ప్రత్యేక ఆఫర్ ఆగస్టు 30తో ముగియనుంది. ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న వినియోగదారులు 2020 మార్చి 28లోపు ఏదైనా ఒక ప్రయాణ తేదీని ఎంచుకోవాల్సి ఉంటుంది. అన్ని రకాల బుకింగ్ సదుపాయాల్లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.
ఇదీ చూడండి: జియో 3నెలల ఆదాయం రూ.10,900 కోట్లు