ETV Bharat / business

జియోలో సిల్వర్ లేక్ మరిన్ని పెట్టుబడులు- 2% వాటా కైవసం - జియో పెట్టుబడులు

జియో ప్లాట్​ఫాంలో రూ. 4,546.80 కోట్ల పెట్టుబడితో మొత్తం 2.08% వాటా కైవసం చేసుకుంది ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్. తాజా నిర్ణయంతో జియోలో సిల్వర్ లేక్ మొత్తం పెట్టుబడి విలువ రూ. 10,205.55 కోట్లకు చేరింది.

silver lake jio
సిల్వల్ లేక్ జియో
author img

By

Published : Jun 5, 2020, 11:20 PM IST

Updated : Jun 6, 2020, 2:28 AM IST

రిలయన్స్ ఇండస్ట్రీస్​ డిజిటల్ ప్లాట్​ఫాం జియోలో ప్రైవేటు ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ తన పెట్టుబడిని మరింత పెంచింది. ఇదివరకే జియోలో 1.15శాతం వాటా కైవసం చేసుకున్న సిల్వర్​ లేక్.. తాజాగా రూ. 4,546.80 కోట్ల పెట్టుబడిని పెట్టింది.

ఫలితంగా జియోలో సిల్వర్ లేక్ మొత్తం పెట్టుబడి రూ. 10,205.55 కోట్లకు చేరగా.. వాటా 2.08శాతానికి పెరిగింది.

"అందుబాటు ధరలో నాణ్యమైన సేవలను పెద్ద ఎత్తున వినియోగదారులకు అందించే విధంగా జియో ప్లాట్​ఫాంకు​ మద్దతు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది."

-ఎగోన్ డర్బన్, సిల్వర్ లేక్ కో-సీఈఓ

కేవలం ఆరు వారాల వ్యవధిలోనే వివిధ సంస్థల నుంచి రూ. 92,202.15 కోట్ల పెట్టుబడులను ఆకర్షించింది జియో. సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్​బుక్ సహా విస్తా ఈక్విటీ పార్ట్​నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబడాల సంస్థలు జియోలో పెట్టుబడులు పెట్టాయి.

ఇదీ చదవండి: జియోలో మరో రూ.9,093 కోట్ల విదేశీ పెట్టుబడి

Last Updated : Jun 6, 2020, 2:28 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.