ETV Bharat / business

హెచ్‌సీఎల్‌ టెక్‌ గౌరవ ఛైర్మన్‌గా శివ్‌ నాడార్‌ - హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఎండీ

హెచ్​సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్.. ఆ సంస్థ ఎండీ పదవి నుంచి దిగిపోయారు. ఇకపై కంపెనీకి గౌరవ ఛైర్మన్​గా ఆయన కొనసాగనున్నారని ఎక్స్ఛేంజీలకు సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ప్రెసిడెంట్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ఉన్న సి.విజయ్‌కుమార్‌ను కొత్త ఎండీగా నియమించినట్లు తెలిపింది.

shiv nadar
శివ్ నాడార్
author img

By

Published : Jul 20, 2021, 6:51 AM IST

హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) బాధ్యతల నుంచి సంస్థ వ్యవస్థాపకులు శివ్‌ నాడార్‌ (76) తప్పుకున్నారు. ఈ నెల 19న సంస్థ పనివేళలు ముగిసినప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వచ్చిందని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ఈనెల 20 నుంచి కంపెనీ గౌరవ ఛైర్మన్‌గా కొనసాగుతూ, బోర్డుకు వ్యూహాత్మక సలహాదారుగా కొత్త బాధ్యతల్ని ఆయన నిర్వర్తించనున్నారు. ప్రస్తుతం ప్రెసిడెంట్‌, ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ)గా ఉన్న సి.విజయ్‌కుమార్‌ను కొత్త ఎండీగా నియమించారు. ఈనెల 20 నుంచి ఈయన అయిదేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. గత ఏడాది జులైలో సంస్థ ఛైర్మన్‌ బాధ్యతల నుంచి శివ్‌ నాడార్‌ తప్పుకోగా, ఆయన కుమార్తె రోష్ని నాడార్‌ మల్హోత్రా సంస్థ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.

ప్రస్థానమిది

శివ్‌ నాడార్‌ 1976లో ఏడుగురితో కలిసి హెచ్‌సీఎల్‌ గ్రూప్‌ను స్థాపించారు. ఈయన నేతృత్వంలో గత 45 ఏళ్లుగా సంస్థ కొనసాగింది. టెక్నాలజీ హార్డ్‌వేర్‌ కంపెనీగా ప్రారంభమైన హెచ్‌సీఎల్‌, 8 బిట్‌ మైక్రో ప్రాసెసర్‌ ఆధారిత స్వదేశీ కంప్యూటర్లను 1978లో భారతీయ వినియోగదార్లకు అందించింది. తరవాత ఇది సాఫ్ట్‌వేర్‌ సేవల రంగంలోకి అడుగుపెట్టింది. 1994లో శివ్‌నాడార్‌ ఫౌండేషన్‌ను స్థాపించి భావితరం నాయకుల్ని సమాజానికి అందించే పరివర్తన విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఇందుకోసం 2021 మార్చి 31 వరకు 98.8 కోట్ల డాలర్లను (సుమారు రూ.7,400 కోట్లు) సంస్థ వెచ్చించింది.

10% పెరిగిన నికర లాభం

జూన్‌ త్రైమాసికంలో హెచ్‌సీఎల్‌ టెక్‌ నికర లాభం 9.9 శాతం మేర పెరిగి రూ.3,214 కోట్లకు చేరింది. ఏడాది క్రితం ఇదే సమయంలో కంపెనీ రూ.2,925 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ఇదే సమయంలో ఆదాయం రూ.17,841 కోట్ల నుంచి 12.5 శాతం పెరిగి రూ.20,068 కోట్లకు చేరింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో స్థిర కరెన్సీ ప్రకారం రెండంకెల వృద్ధి ఆశిస్తున్నామని కంపెనీ తెలిపింది. 'సమీక్షా త్రైమాసికంలో వార్షిక ప్రాతిపదికన స్థిర కరెన్సీలో 11.7 శాతం వృద్ధి సాధించాం. క్లౌడ్‌, డిజిటల్‌ పరివర్తన ఒప్పందాల్లో స్థిర కరెన్సీలో వార్షిక ప్రాతిపదికన 29 శాతం వృద్ధి నమోదైంది. 2021-22లో మిగిలిన త్రైమాసికాల్లోనూ మంచి ఆర్థిక ఫలితాలు సాధిస్తామన్న నమ్మకం ఉంది. 7,500 నికర నియామకాలు చేపట్టామ'ని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రెసిడెంట్‌, సీఈఓ సి.విజయ్‌కుమార్‌ వెల్లడించారు.

  • స్థిర కరెన్సీ వద్ద ఈ ఆర్థిక సంవత్సరంలో రెండంకెల వృద్ధితో సహా ఎబిట్‌ మార్జిన్‌ 19-21 శాతం మధ్య ఉండే అవకాశం ఉందని కంపెనీ భవిష్యత్‌ అంచనాలను ప్రకటించింది.
  • జూన్‌ త్రైమాసికంలో కొత్త ఒప్పందాల మొత్తం కాంట్రాక్టు విలువ (టీసీవీ) 37 శాతం పెరిగి, 166.4 కోట్ల డాలర్లుగా (సుమారు రూ.12,480 కోట్లు) నమోదైంది.

22,000 కొత్త ఉద్యోగాలు

ఈ ఏడాది 20,000-22,000 మంది ఫ్రెషర్లను నియమించుకుంటామని హెచ్‌సీఎల్‌ టెక్‌ ముఖ్య మానవ వనరుల అధికారి వి.వి.అప్పారావు వెల్లడించారు. ఈ సంఖ్యను అధిగమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. సెప్టెంబరు త్రైమాసికంలోనే 6,000 మంది కొత్తవారిని నియమించుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ త్రైమాసికంలో ఉద్యోగులందరికీ 100 శాతం టీకాలు వేయించనున్నామని, ఇప్పటికే 74 శాతం పూర్తయిందని తెలిపారు.

మధ్యంతర డివిడెండ్‌ 300%

రూ.2 ముఖ విలువ కలిగిన ఒక్కో షేరుకు 300 శాతం (రూ.6) మధ్యంతర డివిడెండ్‌ చెల్లించాలని కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది. డివిడెండ్‌ చెల్లింపునకు జులై 28ని రికార్డు తేదీగా నిర్ణయించారు.

మొత్తం ఉద్యోగులు 1,76,499

2021 జూన్‌ త్రైమాసికం ఆఖరుకు కంపెనీలో మొత్తం పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య 1,76,499కు చేరింది. నికరంగా 7,522 మంది చేరారు. వలసల రేటు 11.8 శాతంగా నమోదైంది.

అదనపు డైరెక్టర్‌గా వనితా నారాయణన్‌

ఐబీఎం ఇండియా మాజీ ఎండీ, ఛైర్మన్‌ వనితా నారాయణన్‌ను అదనపు డైరెక్టర్‌గా హెచ్‌సీఎల్‌ టెక్‌ బోర్డులోకి తీసుకున్నారు. ఈమె స్వతంత్ర డైరెక్టర్‌ హోదాలో కొనసాగుతారని కంపెనీ ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. ‘హెచ్‌సీఎల్‌ కుటుంబంలోకి రావాలని వనితా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాను. ఆమె అపార అనుభవం మా కంపెనీకి దిశానిర్దేశం చేయగలద’ని హెచ్‌సీఎల్‌ టెక్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌ మల్హోత్రా వెల్లడించారు.

బీఎస్‌ఈలో సోమవారం షేరు 0.47% నష్టపోయి రూ.1000.20 వద్ద ముగిసింది.

ఇదీ చదవండి: Big Saving Days Sale: అదిరే ఆఫర్లతో ఫ్లిప్​కార్ట్ సేల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.