టాటా గ్రూప్‌తో 70 ఏళ్ల వ్యాపార బంధాన్ని తెంచుకునే ప్రణాళికను సుప్రీం కోర్టుకు సమర్పించినట్లు షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్ గురువారం ప్రకటించింది. 2016లో సైరస్ మిస్త్రీని టాటా గ్రూప్ ఛైర్మన్ పదవి నుంచి తప్పించగా మొదలైన వివాదం.. ఇప్పుడు ఇరు సంస్థల మధ్య బంధం తెగేందుకు కారణమైంది.
టాటా సన్స్‌లో.. టాటాలకు 81.6 శాతం వాటా ఉండగా.. తమకు 18.37 శాతం వాటా ఉన్నట్లు సుప్రీం కోర్టుకు సమర్పించిన కార్యాచరణ ప్రణాళికలో పేర్కొంది షాపూర్‌జీ పల్లోంజీ గ్రూప్. తమ ఈక్విటీ వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లకుపైమాటేననని తెలిపింది.
స్టాక్ మార్కెట్‌లో నమోదైన గ్రూప్ ఆస్తులు సహా బ్రాండ్ విలువను దామాషా ప్రకారం విభజిస్తే ఆస్తుల లెక్కింపుపై విభేదాలు తొలగిపోతాయని షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్ వివరించింది.
ఇదీ చూడండి:ఎయిర్ ఇండియాకు బిడ్ల దాఖలుకు మరింత గడువు!