బడ్జెట్ నిరాశల నుంచి స్టాక్ మార్కెట్లు నేడు తేరుకున్నాయి. సెషన్ ఆరంభంలో ఆటుపోట్లు ఎదుర్కొన్నా.. చివరకు లాభాలతో ముగిశాయి సూచీలు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 137 పాయింట్లు వృద్ధితో 39,872 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 62 పాయింట్లు పుంజుకుని 11,724 వద్ద ముగిసింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,015 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 39,563 పాయింట్ల వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,750 పాయింట్ల అత్యధిక స్థాయి, 11,614 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివివే..
ఏషియన్ పెయింట్స్ 6.32, నెస్లే 5.30, హెచ్‌యూఎల్ 5.06, బజాజ్ ఆటో 4.71, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు 4.29 శాతం లాభాపడ్డాయి.
ఐటీసీ 5.09, టీసీఎస్ 2.86, హెచ్‌సీఎల్‌టెక్ 2.04, హీరోమోటోకార్ప్ 1.95, టెక్ మహీంద్రా షేర్లు 1.88 శాతం నష్టాలను నమోదు చేశాయి.