దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీ దిగ్గజం హ్యుందాయ్ రెండోతరం క్రెటా మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. కొత్త తరం క్రెటాలో భారీ మార్పులు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ కారుకు సంబంధించిన డిజైన్ స్కెచ్‌ను హ్యుందాయ్ మార్కెట్లోకి విడుదల చేసింది.
ఈ కారును చైనాలో విడుదల చేసిన ఐఎక్స్25 స్ఫూర్తితో హ్యుందాయ్ డిజైన్ చేసింది. ప్రస్తుత క్రెటా కంటే ఇది భారీగా కనిపిస్తోంది. కారు గ్రిల్స్‌ను భారీగా పెంచేశారు. ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఈడీ టైల్‌లైట్స్‌లోనూ మార్పులు చేశారు. భారత్‌లో ఈ నెల 6న ఆటోఎక్స్పోలో ఈ కారును ప్రదర్శించనుంది హ్యుందాయ్.
ఇంటీరియర్‌లో మార్పులు..
ఈ కారు ఇంటీరియర్‌లోనూ భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. 10.4 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ అమర్చినట్లు సమాచారం. ఇక హ్యూందాయ్ బ్లూలింక్ కనెక్టెడ్ కార్ యాప్, ఈసిమ్‌తో అందుబాటులో ఉంటుంది. ఈ కారుకు ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్ అదనపు ఆకర్షణగా నిలవనుంది. కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు అందుబాటులో ఉంటాయి. సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటివి ఇందులో ఉండనున్నాయి..
ధర ఎంత?
రెండోతరం క్రెటాను పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో అందుబాటులోకి తేనుంది హ్యుందాయ్. వీటి వేరియంట్ల ధరలు రూ. 9.5 లక్షల నుంచి రూ.16 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి ఆటో పరిశ్రమ వర్గాలు.
-
Catch a sneak peak of the #AllNewCRETA, ready to blow your mind. Stay tuned for the unveiling on 6th February at the #AutoExpo2020. pic.twitter.com/FFVINKerdz
— Hyundai India (@HyundaiIndia) February 1, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Catch a sneak peak of the #AllNewCRETA, ready to blow your mind. Stay tuned for the unveiling on 6th February at the #AutoExpo2020. pic.twitter.com/FFVINKerdz
— Hyundai India (@HyundaiIndia) February 1, 2020Catch a sneak peak of the #AllNewCRETA, ready to blow your mind. Stay tuned for the unveiling on 6th February at the #AutoExpo2020. pic.twitter.com/FFVINKerdz
— Hyundai India (@HyundaiIndia) February 1, 2020
ఇదీ చూడండి:దక్షిణాది రాష్ట్రాలకు 'ఆర్థిక' సంకెళ్లు!