స్టాక్ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ముగిశాయి. జీడీపీ అంచనాలను తగ్గిస్తూ ఆర్బీఐ చేసిన ప్రకటన.. మాంద్యం భయాలను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ షేర్లు భారీగా పతనమయ్యాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 434 పాయింట్లు కోల్పోయింది. చివరకు 37,673 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 139 పాయింట్లు క్షీణించి..11,175 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 38,403 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. 37,633 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది.
నిఫ్టీ నేడు 11,400 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,159 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
టీసీఎస్ 1.03 శాతం, ఇన్ఫోసిస్ 0.90 శాతం, ఓఎన్జీసీ 0.82 శాతం, టెక్ మహీంద్రా 0.74 శాతం, ఎన్టీపీసీ 0.39 శాతం, హెచ్సీఎల్ టెక్ 0.19 శాతం లాభాలను నమోదు చేశాయి.
కోటక్ బ్యాంకు 3.46 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు 3.17 శాతం, హెచ్డీఎఫ్సీబ్యాంకు 2.75 శాతం, టాటా మోటార్స్ 2.37 శాతం నష్టపోయాయి.
ఇదీ చూడండి: ఆర్బీఐ శుభవార్త.. తగ్గిన గృహ, వాహన రుణాల వడ్డీ