ప్రపంచ ఆర్థిక వృద్ధి నెమ్మదిస్తుందన్న ఆందోళనల మధ్య దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతోపాటు బడ్జెట్‌కు ముందు మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించడం నష్టాలకు మరో కారణం.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 100 పాయింట్లు క్షీణించింది. ప్రస్తుతం 39,586 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్ల నష్టంతో 11,834 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.
లాభనష్టాల్లోనివివే..
ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇన్ఫోసిస్, రిలయన్స్, పవర్ గ్రిడ్, మారుతి, టాటా స్టీల్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.
ఎస్ బ్యాంకు, టాటా మోటార్స్, సన్ ఫార్మా, హీరో మోటార్స్, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
రూపాయి, ముడి చమురు
నేటి ట్రేడింగ్‌లో రూపాయి 9పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.03 వద్ద కొనసాగుతోంది.
ముడి చమురు ధరల సూచీ బ్రెంట్ 0.20 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ ముడి చమురు ధర 69.03 వద్ద కొనసాగుతోంది.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై సూచీ, హాంకాంగ్ సూచీ-హాంగ్ సెంగ్, దక్షిణ కొరియా సూచీ కోస్పీ, జపాన్ సూచీ-నిక్కీలు మిశ్రమంగా ట్రేడింగ్ ప్రారంభించాయి.
ఇదీ చూడండి: 'అలా జరిగితే రెండంచెల జీఎస్టీ సాధ్యమే!'