స్టాక్ మార్కెట్లలో రికార్డుల పరంపర కొనసాగుతోంది. విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సూచీలు సరికొత్త జీవితకాల గరిష్ఠస్థాయిల్ని తాకాయి. జీఎస్టీ మండలి తీసుకునే నిర్ణయాలపై సానుకూల అంచనాలూ బుల్ జోరుకు దోహదం చేశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ ఆరంభంలో 129 పాయింట్లు ఎగబాకి చరిత్రలో అత్యధికంగా 41 వేల 481 పాయింట్లకు చేరింది. తర్వాత కాస్త నెమ్మదించింది. ప్రస్తుతం 85 పాయింట్ల లాభంతో 41 వేల 435 వద్ద ట్రేడవుతోంది.
జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ సెషన్ ఆరంభంలో 12 వేల 199 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠాన్ని నమోదుచేసింది. ప్రస్తుతం 20 పాయింట్ల వృద్ధితో 12 వేల 185 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
టాటా మోటార్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఎం&ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.
హెచ్యూఎల్, ఎస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.