స్టాక్ మార్కెట్లు నేడు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ఉండొచ్చనే భయాలతో మదుపరులు కాస్త ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో సెషన్ ప్రారంభంలో కాస్త ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి సూచీలు.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 135 పాయింట్లకు పైగా లాభంతో.. ప్రస్తుతం 41,290 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 30 పాయింట్లకు పైగా వృద్ధితో..12,149 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
హెచ్డీఎఫ్సీ, ఎం&ఎం, సన్‌ఫార్మా, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి.
భారతీ ఎయిర్టెల్, హెచ్‌యూఎల్, నెస్లే, పవర్‌గ్రిడ్, టీసీఎస్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఇదీ చూడండి:అష్టకష్టాలకు... విన్నపాలు