ETV Bharat / business

'చైనాకూ మెక్సికో ఫార్ములా'పై ఆశలతో లాభాలు - సెన్సెక్స్​

అంతర్జాతీయ అనుకూలతల నడుమ స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 166 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 43 పాయింట్లు వృద్ధి చెందింది.

స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 11, 2019, 4:01 PM IST

Updated : Jun 11, 2019, 5:03 PM IST

లోహ,ఆర్థిక రంగ వాటాల కొనుగోళ్ల మద్దతుతో స్టాక్ మార్కెట్లు నేడు లాభాలు నమోదు చేశాయి. అంతర్జాతీయ సానుకూలతలు లాభాలకు ఊతమందించాయి.

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజ్​ సూచీ-సెన్సెక్స్​ 166 పాయింట్లు బలపడింది. చివరకు 39,950 వద్ద ముగిసింది. జాతీయ స్టాక్​ ఎక్స్చేంజ్​ సూచీ-నిఫ్టీ 43 పాయింట్ల వృద్ధితో 11,966 వద్ద స్థిరపడింది.

ఇంట్రాడే సాగిందిలా

స్వల్ప లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్​.. 39,760 - 40,066 పాయింట్ల మధ్య కదలాడింది.

నిఫ్టీ నేడు 12,000 పాయింట్ల గరిష్ఠాన్ని తాకగా.. ఓ దశలో 11,904 పాయింట్ల కనిష్ఠానికి తగ్గింది.

విశ్లేషణ

మెక్సికోపై అధిక సుంకాలను ఎత్తివేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్​ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. చైనాతోనూ సానుకూల వాణిజ్య చర్చలు జరుగుతాయనే అంచనాలు మదుపరుల సెంటిమెంట్​ను ​బలపరిచాయి. ఫలితంగా కొనుగోళ్లు కొనసాగాయి.

లాభనష్టాల్లోనివి ఇవే..

టాటా మోటార్స్ 2.71 శాతం, ఓఎన్​జీసీ 2.58 శాతం, ఎస్​ బ్యాంకు 2.50 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 2.39 శాతం, వేదాంత 2.30 శాతం, హెచ్​సీఎల్​ టెక్​ 1.43 శాతం లాభపడ్డాయి.

సన్​ ఫార్మా 3 శాతం, ఎం & ఎం 1.38 శాతం, ఎల్​ &టీ 0.49 శాతం, హెచ్​డీఎఫ్​సీ 0.43 శాతం, హెచ్​యూఎల్​ 0.41 శాతం, పవర్​ గ్రిడ్​ 0.23 శాతం నష్టాలను నమోదు చేశాయి.

రూపాయి, ముడిచమురు

నేడు రూపాయి 21 పైసలు బలపడింది. డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ 69.44కి చేరింది.

ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్​ స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 62.24 డాలర్లుగా ఉంది.

ఇతర మార్కెట్లు ఇలా..

ఆసియాలోని ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై సూచీ 2.58 శాతం, హాంకాంగ్ సూచీ-హాంగ్​ సెంగ్​ 0.76 శాతం, జపాన్ సూచీ-నిక్కీ 0.33 శాతం, దక్షిణ కొరియా సూచీ-కోస్పీ 0.59 శాతం లాభపడ్డాయి.

ఇదీ చూడండి: బేసిక్ సేవింగ్స్​ ఖాతాలకు మరిన్ని సేవలు

Intro:Body:

wewe

Conclusion:
Last Updated : Jun 11, 2019, 5:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.