స్టాక్ మార్కెట్లు నేడు లాభాలతో ముగిశాయి. ఇంట్రాడేలో భారీ లాభాలను గడించిన సూచీలు.. చివరకు మోస్తరు లాభాలతో సరిపెట్టుకున్నాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఇండస్ఇండ్ బ్యాంకులు నేడు దూకుడు ప్రదర్శించాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 182 పాయింట్లు పుంజుకుంది.. చివరకు 40,652 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 59 పాయింట్ల వృద్ధితో..11,999 వద్దకు చేరింది.
ఇంట్రాడే సాగిందిలా..
సెన్సెక్స్ 40,816 పాయింట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని తాకగా.. 40,576 పాయింట్ల కనిష్ఠాన్ని నమోదు చేసింది. నిఫ్టీ నేడు 12,038 పాయింట్ల అత్యధిక స్థాయి.. 11,966 పాయింట్ల అత్యల్ప స్థాయిల మధ్య కదలాడింది.
లాభనష్టాల్లోనివి ఇవే..
సన్‌ఫార్మా 5.73 శాతం, ఇండస్ఇండ్ బ్యాంకు 5.50 శాతం, ఎస్ బ్యాంకు 2.65 శాతం, రిలయన్స్ 2.47 శాతం, మారుతీ 1.42 శాతం, ఎల్&టీ శాతం 1.12 శాతం లాభాలను ఆర్జించాయి.
కోటక్ బ్యాంకు 1.49 శాతం, టాటా స్టీల్ 0.83 శాతం, హెచ్డీఎఫ్సీ 0.61 శాతం, హెచ్‌యూఎల్ 0.53 శాతం, ఎస్బీఐ 048 శాతం, భారతీ ఎయిర్టెల్ 0.46 శాతం నష్టాలను నమోదు చేశాయి.
రూపాయి, ముడి చమురు..
రూపాయి ఇంట్రాడేలో 15 పైసలు క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే.. మారకం విలువ 71.86కి చేరింది.
ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ నేడు 0.11 శాతం తగ్గింది. బ్యారెల్ ముడి చమురు ధర 60.44 డాలర్లకు చేరింది.
ఇతర మార్కెట్లు ఇలా..
ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు.. షాంఘై సూచీ, హాంకాంగ్ సూచీ, టోక్యో సూచీ, సియోల్ సూచీలు స్వల్పంగా నష్టాన్ని నమోదు చేశాయి. చైనా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోతే.. సుంకాలు మరింత పెరుగుతాయని అధ్యక్షుడు ట్రంప్ చేసిన హెచ్చరికలు ఇందుకు ప్రధాన కారణం.
ఇదీ చూడండి:వాట్సాప్‌ను వెంటనే అప్డేట్ చేసుకోండి.. లేదంటే అంతే!