స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ట్రేడవుతున్నాయి. కీలక రంగాల్లో మదుపరులు అమ్మకాలకు మొగ్గుచూపుతుండటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. విదేశీ మదుపరులు సంవత్సరాంతపు సెలవుల్లో ఉండటం మరో కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఐటీ, ప్రైవేట్ బ్యాకింగ్, వాహన రంగ షేర్లు అధికంగా నష్టాల్లో ఉన్నాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ-సెన్సెక్స్ 139 పాయింట్లకు పైగా నష్టంతో.. ప్రస్తుతం 41,418 వద్ద ట్రేడవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ-నిఫ్టీ 42 పాయింట్లకు పైగా క్షీణతతో..12,213 వద్ద కొనసాగుతోంది.
లాభనష్టాల్లోనివివే..
యాక్సిస్ బ్యాంకు, హెచ్‌యూఎల్, ఎల్&టీ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.
టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్, టాటా స్టీల్, కోటక్ బ్యాంకు, హీరో మోటార్స్, హెచ్‌సీఎల్‌టెక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
ఇదీ చూడండి:వొడాఫోన్ ఐడియాకు షాక్.. నవంబరులో కోట్ల మంది ఔట్!