రిలయన్స్ రిటైల్‌తో ఫ్యూచర్ గ్రూపు విలీనానికి సంబంధించి దిల్లీ హైకోర్టులో కొనసాగుతున్న విచారణపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఈ విషయంలో అన్ని అభ్యర్ధనలను పూర్తి చేయాలని ఆదేశించిన సర్వోన్నత న్యాయస్థానం.. విచారణను మే 4కు వాయిదా వేసింది. ఈ వివాదంలో దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఏప్రిల్ 8న సుప్రీంకోర్టును ఆశ్రయించింది అమెజాన్.
ఈ మేరకు జస్టిస్ ఆర్.ఎఫ్ నారిమన్, జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ హృషీకేశ్ రాయ్‌లతో కూడిన ధర్మాసనం తీర్పునిచ్చింది.
కిశోర్ బియానీ నేతృత్వంలోని ఫ్యూచర్ గ్రూప్(ఎఫ్‌ఆర్‌ఎల్) తన వాటా రూ.24,713 కోట్లను రిలయన్స్ రిటైల్‌కు విక్రయించేందుకు కుదుర్చుకున్న ఒప్పందంపై యథాఫూర్వ స్థితి కొనసాగుతుందని దిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. 2020 మార్చి 18 నాటి సింగిల్ జడ్జి ఉత్తర్వులను కొట్టివేసిన డివిజన్ బెంచ్.. ఫ్యూచర్ గ్రూపునకు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీనిని వ్యతిరేకించిన అమెజాన్.. చట్టవిరుద్ధం, అసమాన, తీర్పుగా పేర్కొంది.
ఇవీ చదవండి: దిల్లీ హైకోర్టులో ఫ్యూచర్ గ్రూప్‌నకు ఊరట