టాటా సన్స్ సీఈఓగా సైరస్ మిస్త్రీని పునర్ నియమించాలన్న జాతీయ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్(ఎన్సీఎల్ఏటీ) ఆదేశాలపై సుప్రీం కోర్టు స్టే విధించింది. మిస్త్రీతో పాటు మరికొందరికి నోటీసులు జారీ చేశారు.
ఎన్సీఎల్ఏటీ తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణకు అంగీకరించిన సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
ఎన్సీఎల్ఏటీ.. సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, మిస్త్రీకి ఊరట కల్పిస్తూ డిసెంబర్ 18న తీర్పును ఇచ్చింది. మిస్త్రీని పునర్ నియమించాలని ఆదేశించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ టాటా సన్స్ సుప్రీంను ఆశ్రయించింది.
ఆర్ఓసీ విజ్ఞప్తి తిరస్కరణ
తమను సంప్రదించకుండా ఆదేశాలు ఇచ్చారని, తీర్పులో మార్పులు చేయాలని రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్(ఆర్ఓసీ).. ఎన్సీఎల్ఓటీకి పిటిషన్ ఇచ్చింది. అయితే ఈ పిటిషన్ను ఈ నెల 6న ఎన్సీఎల్ఏటీ కొట్టివేసింది.