ETV Bharat / business

జీఎస్​టీ వివాదాలపై విచారణకు సుప్రీం అంగీకారం

జీఎస్​​టీ ఎగవేతదార్ల అరెస్టులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. పన్ను ఎగవేతదార్ల అరెస్టులు, విచారణ వంటి అంశాలపై పిటిషనర్లు, పన్ను శాఖ వాదనలను విననుంది అత్యున్నత న్యాయస్థానం.

జీఎస్​టీ
author img

By

Published : May 29, 2019, 2:59 PM IST

వస్తుసేవల పన్ను (జీఎస్​టీ)కు సంబంధించిన వివాదాస్పదమైన అంశాలపై విచారణకు సుప్రీంకోర్డు అంగీకరించింది. పన్ను శాఖ అధికారాలైన జీఎస్​టీ ఎగవేతదార్ల అరెస్టు, విచారణ వంటి అంశాలపై విచారణ చేపట్టనుంది.

ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్, జస్టిస్ అనిరుద్ధ బోస్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. దీనిపై నాల్గు వారాల్లోగా స్పందించాలని సూచించింది.

జీఎస్​టీ ఎగవేతదార్లపై కేసుల్లో పలు హైకోర్టులకు వేరు వేరు రకాల ఆభిప్రాయాలున్నాయని.. అయితే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని సుప్రీం పేర్కొంది.

అన్ని హైకోర్టులు ఈ అంశాలను దృష్టిలో ఉంచుకునే జీఎస్​టీ ఎగవేత కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసే అంశాలను పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

జీఎస్​టీ ఎగవేతకేసులో వ్యక్తులకు రక్షణ కల్పించలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసిన విషయాన్ని సుప్రీం ఈ సందర్భంగా గుర్తుచేసింది.

తెలంగాణ హైకోర్టు తీర్పు ఏంటంటే..

జీఎస్​టీ చట్టం 2017 కింద హైదరాబాద్ జీఎస్​టీ కమిషనరేట్​ కొంత మందికి జీఎస్​టీ ఎగవేత ఆరోపణలతో సమన్లు జారీ చేసింది.

సమన్లు వచ్చిన వారు తెలంగాణ హైకోర్టును సంప్రదించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. జీఎస్​టీ ఎగవేతదార్ల అరెస్టులను అడ్డుకోలేమని ఏప్రిల్ 18న తీర్పునిచ్చింది.

దీంతో పిటిషనర్లు హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అయితే అక్కడ కూడా వారికి చుక్కెదురైంది. తెలంగాణ హైకోర్టు తీర్పును సమర్ధిస్తూ.. పిటిషన్​ను కొట్టేస్తున్నట్లు సుప్రీం స్పష్టం చేసింది.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.