ETV Bharat / business

స్వచ్ఛంద పదవీ విరమణకు ఎస్​బీఐ ఉద్యోగులు సిద్ధమేనా? - SBI job news

మానవ వనరుల సమర్థ వినియోగం, ఖర్చు తగ్గించుకునేందుకు చర్యలు చేపట్టింది భారతీయ స్టేట్ బ్యాంకు. ఇందులో భాగంగా ఉద్యోగుల సంఖ్య తగ్గించుకునేందుకు స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్​ఎస్​) తీసుకురానుంది. అయితే ఇప్పటికే ఈ స్కీమ్​కు దాదాపు 30 వేల మంది అర్హత సాధించినట్లు సంస్థ తెలిపింది. డిసెంబర్​ 1 నుంచి ఫిబ్రవరి వరకు 3 నెలల పాటు ఈ పథకం అమల్లో ఉంటుంది.

SBI moots VRS scheme to optimise costs, about 30,000 employees eligible
ఎస్​బీఐ స్వచ్ఛంద విరమణలోకి 30 వేల ఉద్యోగులు..!
author img

By

Published : Sep 6, 2020, 8:43 PM IST

భారతీయ స్టేట్ బ్యాంకు(ఎస్‌బీఐ) తన ఉద్యోగుల కోసం స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని(వీఆర్‌ఎస్‌) తీసుకురానుంది. ఈ 'సెకండ్‌ ఇన్నింగ్స్‌ టాప్‌-వాలంటరీ రిటైర్‌మెంట్‌ స్కీమ్‌-2020' (ఎస్‌ఐటీవీఆర్‌ఎస్‌-2020) ద్వారా మానవ వనరులు, వ్యయాలను సమర్థంగా వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు బ్యాంకు ఇటీవలే పేర్కొంది. ఈ వీఆర్​ఎస్​ స్కీమ్​ కోసం కొన్ని నియమ, నిబంధనలు అర్హతగా పెట్టింది. వాటికి దాదాపు 30వేల190మంది ఉద్యోగులు అర్హత సాధించినట్లు సంస్థ తెలిపింది. ఈ వీఆర్​ఎస్​ స్కీమ్​ డ్రాఫ్ట్​ ఇప్పటికే సిద్ధమవగా.. దీనికి బోర్డు ఆమోద ముద్ర వేయాల్సి ఉందని సమాచారం.

ప్రతి ఏటా అమలు...!

డిసెంబరు 1 నుంచి ఫిబ్రవరి చివరి వరకు ఏటా మూడు నెలల పాటు.. ఈ స్కీమ్​ అమల్లో ఉంటుంది. ప్రతిపాదిత అర్హత ప్రమాణాల ప్రకారం.. మొత్తం 11,565 మంది అధికారులు(జూనియర్‌ మేనేజ్‌మెంట్‌ గ్రేడ్‌ స్కేల్‌-1 నుంచి టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌ స్పెషల్‌ స్కేల్‌-1 వరకు); 18625 మంది సిబ్బంది(క్లరికల్‌, సబ్‌ స్టాఫ్‌)కి ఈ పథకం కింద అర్హత ఉంటుంది.

ఒక వేళ ఈ పథకం కింద 30 శాతం మంది పదవీ విరమణను ఎంచుకుంటే.. జులై 2020 నెల వేతనం ప్రకారం.. బ్యాంకుకు రూ.1,662.86 కోట్ల మేర నికరంగా మిగులుతుంది.

ఈ ఏడాది మార్చి చివరికి ఎస్‌బీఐ సిబ్బంది సంఖ్య 2,49,448గా ఉంది. సిబ్బంది వ్యయాలను తగ్గించుకుని.. ఉత్పాదకతను మెరుగుపరచుకోవాలని భావిస్తున్నట్లు ఎస్‌బీఐ స్పష్టం చేసింది. గతేడాది 2.57 లక్షల సిబ్బంది ఉండటం గమనార్హం.

ఇవీ అర్హత నిబంధనలు..

  • ఎస్‌బీఐ (విలీనం అయిన ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు సిబ్బంది సైతం)లోని అందరు శాశ్వత అధికారులు, సిబ్బందికి ఈ వీఆర్‌ఎస్‌ వర్తిస్తుంది.
  • దరఖాస్తు చేసే నాటికి 25 ఏళ్ల సర్వీసు, 55 ఏళ్ల వయసును పూర్తి చేసి ఉండాలి. మూడు లేదా నాలుగు ప్రమోషన్‌ అవకాశాలను కోల్పోయిన అధికారులకు ఇది వర్తిస్తుంది.
  • వీఆర్‌ఎస్‌ను ఎంచుకునే ఉద్యోగులకు మిగిలిన సర్వీసుకు గాను వేతనంలో 50శాతం వరకు ఎక్స్‌ గ్రేషియాగా అందిస్తారు. (చివరిగా వేతనం తీసుకున్న నాటి నుంచి గరిష్ఠంగా 18 నెలలు).

వీఆర్​ఎస్​ తీసుకున్నవారికి గ్రాట్యుటీ, పెన్షన్​, ప్రావిడెంట్​ అండ్​ మెడికల్​ బెనిఫిట్స్ ఉంటాయి.

మళ్లీ విధుల్లోకి రావొచ్చు...!

ఈ స్కీమ్​ ఆధారంగా రిటైర్​​ అయిన సిబ్బంది మళ్లీ సంస్థలో పనిచేయవచ్చు. అయితే రెండేళ్ల తర్వాత మాత్రమే ఇది సాధ్యపడుతుంది. 2017లో ఎస్బీఐలో కలిసిన ఐదు సంస్థలు కూడా విలీనానికి ముందు వీఆర్​ఎస్​ను ప్రకటించాయి. 2001 నుంచి ఎస్బీఐ వీఆర్​ను అమలు చేస్తోంది. అయితే బ్యాంక్​ యూనియన్లు మాత్రం ఈ స్కీమ్​పై ఆసక్తి కనబర్చట్లేదు. కరోనాతో ఇబ్బందులు పడుతున్న సమయంలో సంస్థ నిర్ణయాన్ని యూనియన్లు వ్యతిరేకిస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.