అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ వివిధ కాలపరిమితి డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 179 రోజుల వరకు కాలపరిమితి ఉన్న డిపాజిట్లపై వడ్డీ రేటును 0.5 నుంచి 0.75 శాతం వరకు తగ్గించింది. ఈ మేరకు బ్యాంకు ఓ ప్రకటన జారీ చేసింది.
ఎక్కువ కాల పరిమితి డిపాజిట్ల కోసం, రిటైల్ విభాగంలో 0.2శాతం వరకు, బల్క్ డిపాజిట్లపై 0.35 శాతం వరకు తగ్గించినట్లు తెలిపింది. రూ. 2 కోట్లు అంతకన్నా ఎక్కువ ఉన్న బల్క్ డిపాజిట్లపైనా రేట్లు తగ్గించింది.
కొత్త రేట్లు 2019 ఆగస్ట్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. అధిక నగదు లభ్యత, వడ్డీ రేట్ల తగ్గుదల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
- ఇదీ చూడండి: మాల్యా పిటిషన్పై ఆగస్టు 2న సుప్రీం విచారణ