ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వినియోగదారులను అలర్ట్ చేసింది. జూన్ 17 (గురువారం) మధ్యాహ్నం 12:30 నుంచి 2:30 వరకు తమ సేవలకు అంతరాయం ఏర్పడనున్నట్లు ప్రకటించింది. ఈ రెండు గంటల సమయంలో యోనో, యోనో లైట్ యాప్లు, నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు తాత్కాలికంగా పని చేయవని వెల్లడించింది. వినియోగదారులు ఈ విషయం గమనించి సహకరించాలని కోరింది.
మెయింటనెన్స్ పనుల్లో భాగంగా అంతరాయం ఏర్పడనున్నట్లు ఎస్బీఐ పేర్కొంది. జూన్ 13 కూడా ఇలాంటి కారణాలతోనే ఆన్లైన్ సర్వీస్లు 4 గంటల పాటు నిలిచిపోయాయి. మే 21, 23 తేదీల్లోనూ కొన్ని గంటల పాటు ఎస్బీఐ సేవలన్నింటికీ అంతరాయం ఏర్పడింది.
ఎస్బీఐ ఆన్లైన్ యూజర్ల లెక్క..
డిసెంబర్ 31 నాటికి.. ఎస్బీఐకి 8.5 కోట్ల నెట్ బ్యాంకింగ్ యూజర్లు, 1.9 కోట్ల మొబైల్ బ్యాంకింగ్ యూజర్లు ఉన్నారు. యోనో యాప్లో 3.45 కోట్ల రిజిస్టర్డ్ యూజర్లు ఉండగా.. అందులో రోజుకు సగటున 90 లక్షల మంది ఒకసారైనా యాప్ వాడుతున్నారు.
ఇదీ చదవండి: ద్రవ్యోల్బణానికి ప్రభుత్వాల ఆజ్యం