ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్‌కు పెట్టుబడుల వరద కొనసాగుతోంది. సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ పెట్టుబడుల సంస్థ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) రూ.9,555 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు రిలయన్స్ రిటైల్ గురువారం ప్రకటించింది. దీనితో రిటైల్ వ్యాపారాల్లో 2.04 శాతం వాటాను పీఐఎఫ్‌కు బదిలీ చేయనున్నట్లు వివరించింది.
మొత్తం 10.52 శాతం వాటాల విక్రయం ద్వారా రెండు నెలల్లో రూ.47,265 కోట్ల పెట్టుబడులు వచ్చినట్లు రిలయన్స్ రిటైల్ వెల్లడించింది. దీనితో రిటైల్ వ్యాపారాల ఈక్విటీ విలువ రూ.4.58 లక్షల కోట్లకు చేరినట్లు పేర్కొంది.