షామీ, ఒప్పో, వివో.. ఇతర చైనీస్ ఫోన్ల ఉత్పత్తిసంస్థలు స్మార్ట్ఫోన్లను పోటాపోటీగా మార్కెట్లోకి తీసుకొస్తుంటే.. కాస్త ఆలస్యంగా సామ్సంగ్ అదే ధోరణి అందిపుచ్చుకుంది. సామ్సంగ్ గెలాక్సీ ఏ90 పేరుతో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్లను వదిలేందుకు సిద్ధమైనట్లు సంకేతాలిచ్చింది.
ఆర్-సిరీస్ స్మార్ట్ఫోన్లకు రీబ్రాండెడ్‌గా గెలాక్సీ ఏ-90 వస్తోందని తెలిపింది ప్రముఖ లీక్‌స్టర్ 'ఆన్‌లీక్స్'. అంతకుముందు ఎస్ఎం-ఏ90ఎక్స్ ను గెలాక్సీ ఏ-90గా తీసుకురావాలని సామ్సంగ్ ప్రయత్నించింది. కానీ.. ఇవే ఇప్పుడు ఆర్ సిరీస్‌లో భాగంగా వస్తున్నట్లు ప్రకటించింది ఆన్‌లీక్స్.
ఆన్‌లీక్స్ ప్రకారం.. సామ్సంగ్ నుంచి రెండు ఆర్-సిరీస్ స్మార్ట్‌ఫోన్ మోడళ్లు రానున్నాయి. ఇందులో ఒకటి 5G కనెక్టివిటీ, మరొకటి ప్రత్యేక కెమెరా సదుపాయంతో వస్తున్నాయని తెలిపింది.
బ్యాటరీ సామర్థ్యం ఎక్కువ సమయం ఉండేలా.. సామ్సంగ్ ఈ స్మార్ట్ఫోన్లను రూపొందిస్తున్నట్లు సమాచారం. 3 వెనక కెమెరాలను వివిధ ప్రత్యేకతలతో తీసుకొస్తోంది.
ప్రత్యేకతలు..
- 6.5 అంగుళాల భారీ తెర
- ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 5జీ కనెక్టివిటీ
- క్వాల్కామ్ 675 స్నాప్‌డ్రాగన్ చిప్సెట్
- 6జీబీ రామ్
- అధిక బ్యాటరీ సామర్థ్యం
- అల్ట్రావైడ్, ఎఫ్ఓవీ, టెలిఫొటో 3 వెనక కెమెరాలు
- ఎక్కువ రిసొల్యుషన్‌తో సెల్ఫీ కెమెరా