ETV Bharat / business

గెలాక్సీ ఫోల్డ్​ ఫోన్​పై బంపర్​ ఆఫర్​ భారత్​కే!

శాంసంగ్​ గెలాక్సీ ఫోల్డబుల్ (మడత) ఫోన్ ఎట్టకేలకు మార్కెట్లోకి రానుంది. సెప్టెంబర్​లో ఈ ఫోన్​ను విడుదల చేయనుంది శాంసంగ్. అందరికన్నా ముందుగా ఈ ఫోన్​ భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

author img

By

Published : Jul 26, 2019, 5:09 PM IST

శాంసంగ్
సెప్టెంబర్​లో రానున్న గెలాక్సీ మడత ఫోన్

మొబైల్ ప్రేమికులను ఊరిస్తున్న గెలాక్సీ ఫోల్డబుల్ (మడత) ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్. సెప్టెంబర్​ నుంచి ఎంపిక చేసిన మార్కెట్లలో ఈ ఫోన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు శాంసంగ్ తెలిపింది.

మొదట ఏప్రిల్ 26నే మార్కెట్లోకి ఈ ఫోన్​ను విడుదల చేయాలని శాంసంగ్ భావించింది. అయితే టెస్టింగ్ దశలో డిస్​ప్లేపై భారీ ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ కారణంగా విడుదలను వాయిదా వేసింది.

ప్రస్తుతం ఈ మోడల్​కు తుది మెరుగులు దిద్దుతోంది శాంసంగ్. ముఖ్యంగా 'ఇన్ఫినిటీ డిస్​ప్లే' విషయంలో కీలక మార్పులు చేసినట్లు శాంసంగ్ ఓ ప్రకటనలో తెలిపింది. ఫోన్ మడతపెట్టడంలో సహకరించే కీలు భాగాలకు ఇరువైపులా (పైనా, కింద) అదనపు రక్షణ కవచాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. యూజర్లకు ప్రత్యేక ఫోల్డబుల్ అనుభూతిని ఇచ్చేందుకు మార్పులు చేసినట్లు పేర్కొంది.

ఎంపిక చేసిన మార్కెట్లలో భారత్​, దక్షిణ కొరియా, జపాన్ సహా పలు ఇతర మార్కెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. భారత్​లోనే ఈ ఫోన్​ ముందుగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

గెలాక్సీ ఫోల్డ్ ఫీచర్లు:

  • 16ఎంపీ+12ఎంపీ+12ఎంపీలతో వెనుకవైపు 3 కెమెరాలు
  • 10 ఎంపీల సెల్ఫీ కెమెరా
  • 16జీబీ ర్యామ్/512 జీబీ ఆన్​బోర్డ్ స్టోరేజి
  • క్వాల్కామ్ స్నాప్​డ్రాగన్ 855 ఆక్టా-కోర్ ప్రాసెసర్

ఇతర కీలక ఫీచర్లను సెప్టెంబర్​లో మార్కెట్లోకి విడుదల సందర్భంగా వెల్లడించనుంది శాంసంగ్​.

ఇదీ చూడండి: ఆగస్టు 1న హువావే "వై9 ప్రైమ్ 2019"

Mumbai, July 26 (ANI): Bollywood actor Janhvi Kapoor seen post gym session in Mumbai. It is no secret that 'Dhadak' girl is a gym freak. Actor Isha Koppikar also spotted post salon session in the city. She was spotted wearing casual tee and denim. Meanwhile, Athiya Shetty was seen in Mumbai as well. She was spotted outside casting director Mukesh Chhabra's office.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.