ETV Bharat / business

సామ్​సంగ్​ స్మార్ట్​వాచ్​ ధరలపై భారీ డిస్కౌంట్​! - samsung fitness trackers price

సామ్​సంగ్​.. పంద్రాగస్టు పురస్కరించుకుని తన ప్రొడక్ట్స్​పై భారీ డీస్కౌంట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్​వాచ్​లను తక్కువ ధరలకే అందిస్తోంది. మరి ఆ మోడల్స్​ ఏంటి? ఆ డిస్కౌంట్లు ఎంత? వివరాలు మీ కోసం..

smartwatch
స్మార్ట్​వాచ్​
author img

By

Published : Aug 15, 2021, 1:38 PM IST

Updated : Aug 15, 2021, 2:16 PM IST

స్మార్ట్​వాచ్.. ప్రస్తుతం ట్రెండీ గ్యాడ్జెట్స్​లో ఇదొకటి. మొబైల్ నోటిఫికేషన్ల నుంచి ఆరోగ్య సంరక్షణ వరకు అన్ని రకాల సమాచారాన్ని యూజర్‌కు చేరవేస్తుండటం వల్ల సంప్రదాయ వాచ్‌ల స్థానంలో వీటిని ఉపయోగించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు ఉన్న వాచ్​లపై వినియోగదారులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని సామ్​సంగ్​ తన వినియోగదారులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. తమ కంపెనీ తయారు చేసిన పలు ప్రొడక్ట్స్​ను భారీ డిస్కౌంట్​తో విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా స్మార్ట్​వాచ్​ల ధరలను భారీగా తగ్గించింది. ఓ సారి వాటిపై లుక్కేద్దాం..

సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​ యాక్టివ్ 2​(స్టీల్​)

ఈ​ మోడల్​ రూ.5 వేల డిస్కౌంట్​తో రూ.28,490కే పొందే వీలుంది. వైఫై, బ్ల్యూటూత్​ తదితర ఫీచర్లు ఉన్నాయి.

  • 1.4 అంగుళాల పొడవు డిస్​ప్లే
  • 1.05 జీహెజ్​జెడ్​ ప్రొసెసర్​
  • బారోమీటర్​
  • గోరో సెన్సర్​
  • లైట్​ సెన్సర్​
  • ఆప్టికల్​ హార్ట్​ రేట్ సెన్సర్​
  • ఎన్​ఎఫ్​సీ కనెక్టివిటీ విత్​ యాక్సిలిరోమీటర్​
smartwatch
సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​ యాక్టివ్ 2​(స్టీల్​)

సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​(46ఎంఎం, 4జీ)

ఈ మోడల్​ను రూ.18,990లకు పొందొచ్చని సామ్​సంగ్​​ తెలిపింది. దీని అసలు ధర రూ.34,990గా ఉంది.

  • హార్ట్​ రేటింగ్​, స్లీప్​ మానిటరింగ్​
  • ఎల్​టీఈ కనెక్టివిటీ
  • కాల్స్​, మెసేజ్​ నోటిఫికేషన్స్​
  • వైర్​లెస్​ ఈయర్​ బడ్స్​ను కంట్రోల్​ కూడా చేయొచ్చు.
smartwatch
సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​(46ఎంఎం, 4జీ)

సామ్​సంగ్​ గెలాక్సీ వాచ్​ 3 ఎల్​టీఈ(41ఎంఎం, 4జీ)

ఈ స్మార్ట్​వాచ్​పై పెద్దగా డిస్కౌంట్ ఏమీ లేదు. రూ.500 మాత్రమే తగ్గించి రూ.34,490కు విక్రయిస్తోంది. ఇది 4జీ మోడల్​. దీని ఫీచర్స్​ ఏంటంటే..

  • 1.2 అంగుళాల డిస్​ప్లే
  • 1.15జీహెచ్​జెడ్​ ప్రొసెసర్​
  • ఐపీ68 రేటింగ్​
  • బుల్ట్​ ఇన్​ జీపీఎస్​,
  • ఫాల్​ డిటెక్షన్​,
  • వర్కౌట్​ ట్రాకింగ్​,
  • రక్తంలోని ఆక్సిజన్​ శాతాన్ని పర్యవేక్షించడం
  • యాక్సిలిరోమీటర్​, బారోమీటర్​, గైరో సెన్సార్​, లైట్​ సెన్సార్​, ఆప్టికల్​ హార్ట్​ రేట్​ సెన్సార్​

సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​ 2

ఈ మోడల్​ ఎంతో బెస్ట్​ అని చెపొచ్చు. 1.1 అంగుళాల పొడవు డిస్​ప్లే ఉండే ఈ ఫిట్​ ట్రాకర్​ బరువు 21గ్రాములే. దీనిని రూ.వెయ్యి డిస్కౌంట్​తో రూ.3,999కే అందిస్తోంది. వాటర్​, స్వెట్​ రెసిస్టెంట్​ దీని ప్రత్యేకత. తరచుగా చేతులు కడుక్కోమని గుర్తు చేస్తుంది కూడా. 15రోజుల పాటు బ్యాటరీ నడుస్తుంది. హార్ట్​ రేట్​, స్ట్రెస్​ ట్రాకింగ్​ వంటి ఫీచర్లు కూడా ఉంటాయి.

smartwatch
సామ్​సంగ్​ గెలాక్సీ ఫిట్​ 2

ఇదీ చూడండి: 'సామ్​సంగ్' సరికొత్త మడత ఫోన్లు

Last Updated : Aug 15, 2021, 2:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.