శాంసంగ్ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన మరో మడత ఫోన్ 'గెలాక్సీ జెడ్ ఫ్లిప్'ను భారత్‌లో ఆవిష్కరించనుంది. ఈ నెల 26 నుంచి భారత మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ఇందుకు సంబంధించి ఫిబ్రవరి 21 నుంచి ప్రీ-బుకింగ్ సౌకర్యాన్ని కల్పించనుంది శాంసంగ్.

ప్రత్యేకమైన ఆఫర్లు..
శాంసంగ్‌లో అత్యంత ఖరీదైన ఫోన్లలో ఒకటైన జెడ్ ఫ్లిప్‌కు అనేక సౌకర్యాలు కల్పిస్తోంది.
- ప్రమాద బీమా కవరేజీ
- వన్‌టైం స్క్రీన్ ప్రొటెక్షన్ (రాయితీపై)
- 24X7 కాల్ సెంటర్ సపోర్ట్
- 12 నెలల జీరో ఈఎంఐ సదుపాయం
- నాలుగు నెలల యూట్యూబ్ ప్రీమియం చందా
గెలాక్సీ జెడ్ ఫ్లిప్ కొత్త తరం ఫోల్డబుల్ గ్లాస్‌తో తయారైంది. 6.7 అంగుళాల తెర కలిగిన ఈ ఫోన్ మడతపెట్టిన తర్వాత జేటులో ఇమిడిపోతుంది. ఇందులో పవర్‌షేర్ వైర్లెస్, వైర్ ద్వారా ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం కల్పించింది.
ఇది ప్రీమియం ఫోన్ అయినప్పటికీ ఇందులో రెండు సిమ్‌లను ఉపయోగించుకోవచ్చని సంస్థ తెలిపింది. అయితే ఒకటి మాత్రం ఈ-సిమ్ స్లాట్ ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఎయిర్టెల్, జియోలు మాత్రమే ఈ-సిమ్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
ప్రత్యేకతలు..
- 6.7 అంగుళాల మడత తెర
- డైనమిక్ ఎమోలెడ్ ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్ప్లే
- ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్
- 7 నానోమీటర్ అక్టాకోర్ ప్రాసెసర్
- 8 జీబీ ర్యామ్-256 జీబీ రామ్
- 3,300 ఎంఏహెచ్ బ్యాటరీ (వైర్, వైర్ లెస్ ఫాస్ట్ ఛార్జింగ్)
- వెనుక కెమెరాలు (12 ఎంపీ+12 ఎంపీ)
- 10 ఎంపీ సెల్ఫీ కెమెరా
- లభించే రంగులు: మిర్రర్ పర్పుల్, మిర్రర్ బ్లాక్, మిర్రర్ గోల్డ్
- ధర రూ.1,09,999.00