ETV Bharat / business

'రాయల్​ ఎన్​ఫీల్డ్​ నుంచి 28 కొత్త మోడల్స్​' - రాయల్​ ఎన్​ఫీల్డ్ పెట్టుబడుల ప్రణాళిక

మిడ్​ రేంజ్ బైక్ సెగ్మెంట్​పై ప్రముఖ మోటార్​ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్​ ఎన్​ఫీల్డ్ సరికొత్త ప్రణాళికను ప్రకటించింది. రానున్న ఏడేళ్లలో కనీసం 28 కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేయాలని భావిస్తున్నట్లు తెలిపింది. ఎలక్ట్రిక్, డిజిటల్ సొల్యూషన్స్​ వంటి సాంకేతికతతో వచ్చే మోడల్​లు కూడా ఇందులో ఉండనున్నట్లు పేర్కొంది.

ROYAL ENFIELD PLANS TO LAUNCH ONE BIKE EVERY QUARTER
రాయల్ ఎన్​ఫీల్డ్​ నుంచి మూడు నెలలకో బైక్
author img

By

Published : Nov 8, 2020, 2:44 PM IST

ప్రముఖ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్​ఫీల్డ్ కొత్త బైక్​ల విడుదలలో దూకుడుగా వ్యవహరిస్తోంది. రానున్న 5 నుంచి 7 ఏళ్లలో కనీసం మూడు నెలలకోసారి ఒక కొత్త మోడల్​ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలిపింది. కనీసం 28 మోడళ్లను ఈ సమయంలో ఆవిష్కరించాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.

ఈ బైక్​లన్నీ మిడ్​ రేంజ్​ సెగ్మెంట్​ అయిన 250 సీసీ నుంచి 750 సీసీ ఇంజిన్​లతో వస్తాయని రాయల్ ఎన్​ఫీల్డ్ సీఈఓ వినోద్ దాసరి తెలిపారు.

పెట్టుబడుల్లో ఎక్కువ భాగం వాటికే..

ఈ ప్రణాళికోసం ఎంత పెట్టుబడులు పెట్టనున్నారనే విషయాన్ని మాత్రం వినోద్ చెప్పలేదు. ఎలక్ట్రిక్, డిజిటల్​ సొల్యూషన్స్​ వంటి సాంకేతికతలతో ఈ కొత్త బైక్​లను తీసుకురానున్నట్లు మాత్రం స్పష్టం చేశారు. రానున్న 2-3 ఏళ్ల వరకు వచ్చే డిమాండ్​కు తగ్గ ఉత్పత్తి సామర్థ్యం తమకు ఉన్నందున.. పెట్టుబడుల్లో ఎక్కువ భాగం కొత్త టెక్నాలజీలు, వ్యాపార విస్తరణల కోసం కేటాయించనున్నట్లు పేర్కొన్నారు.

విస్తరణ..

అంతర్జాతీయ మార్కెట్​లో కొన్నాళ్లుగా తాము ఆసాధారణ వృద్ధిని నమోదు చేస్తున్నట్లు తెలిపింది రాయల్ ఎన్​ఫీల్డ్. గత ఏడాది కాలంగా బ్రిటన్​లో 'ఇంటర్​సెప్టార్' ఎక్కువగా అమ్ముడుపోయిన మోడల్​గా నిలిచినట్లు వెల్లడించింది. ప్రపంచ మార్కెట్లో మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు అర్జెంటీనాలో ఇటీవలే అసెంబ్లీ యూనిట్​ను నెలకొల్పినట్లు పేర్కొంది. రానున్న 6-12 నెలల్లో థాయ్​లాండ్, బ్రెజిల్​లోనూ అసెంబ్లీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

ఇదీ చూడండి:దీపావళి కానుకగా మహీంద్ర సరికొత్త 'థార్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.