కేంద్రం తీసుకొచ్చిన మూడు నూతన వ్యవసాయ చట్టాలు రిలయన్స్ ఇండస్ట్రీస్, జియోలకు లబ్ధి చేకూరుస్తాయనే ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ స్పందించింది. రైతులతో నేరుగా ఆహార ధాన్యాలు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కోసం పంజాబ్, హరియాణాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఎక్కడ కూడా వ్యవసాయ భూమిని నేరుగా గానీ, పరోక్షంగా గానీ కొనుగోలు చేయదలచుకోలదని వివరణ ఇచ్చింది.
'ప్రస్తుతం దేశంలో తీవ్రంగా చర్చించుకుంటున్న మూడు నూతన వ్యవసాయ చట్టాలతో మాకు సంబంధం లేదు. వాటితో మాకు ఎలాంటి ప్రయోజనాలు లేవు.' అని ఆర్ఐఎల్ స్పష్టం చేసింది.
ఈ మేరకు తమ అనుభంద సంస్థ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ పంజాబ్, హరియాణా హై కోర్టులో పిటిషన్ వేసినట్లు ఆర్ఐఎల్ తెలిపింది. ఈ విషయంపై అత్యవసరంగా ప్రభుత్వాధికారులు చొరవ తీసుకుని తమ సంస్థ టవర్ల విధ్వంసాన్ని ఆపేలా చూడాలని కోరింది.
ఇదీ చూడండి:ఫ్రీ కాల్స్‌తో జియోకు యూజర్లు పెరిగేనా?