ETV Bharat / business

రూ.14 లక్షల కోట్లపైకి రిలయన్స్ ఎం-క్యాప్​ - 14 లక్షల కోట్ల మార్క్ దాటిన రిలయన్స్ విలువ

దేశీయ కార్పొరేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ (ఆర్​ఐఎల్​)​ మార్కెట్ విలువ సరికొత్త రికార్డు స్థాయికి చేరింది. వరుసగా ఏడు రోజుల లాభాలతో కంపెనీ ఎం-క్యాప్ తొలిసారి రూ.14 లక్షల కోట్ల మార్క్ దాటింది. లక్ష్యానికి ముందే కంపెనీ రుణ రహితంగా మారడం కూడా ఈ స్థాయిలో ఎం-క్యాప్ పెరిగేందుకు కారణం.

Reliance Industries market valuation
రిలయన్స్ ఇండస్ట్రీస్​ ఎం క్యాప్
author img

By

Published : Jun 3, 2021, 2:37 PM IST

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ మరో ఘనతను సాధించింది. వరుసగా ఏడు రోజుల లాభాలతో సంస్థ మార్కెట్ క్యాపిటల్​ (ఎం-క్యాప్​) తొలిసారి రూ.14 లక్షల కోట్లు దాటింది. ఈ మార్క్​ అందుకున్న తొలి లిస్టెడ్ కంపెనీ కూడా ఇదే.

వరుసగా ఏడు రోజుల సానుకూలతలతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 14.53 శాతం పుంజుకున్నాయి. దీనితో ఒక షేరు విలువ రూ.2,250 మార్క్ దాటింది. దీనితో కంపెనీ మొత్తం విలువ రూ.14,04,123.26 కోట్లకు చేరింది.

పటిష్ఠమైన బ్యాలెన్స్​ షీట్లు..

రికార్డు స్థాయిలో నిధుల సమీకరణ వల్ల రుణాలను ముందస్తుగా చెల్లించడం వల్ల బ్యాలెన్స్‌ షీట్లు మరింతగా పటిష్ఠమై, వ్యాపారాభివృద్ధికి కావాల్సిన మొత్తం అందుబాటులో ఉందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ బుధవారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది.

లక్ష్యం కన్నా ముందే రుణ రహితం..

2020-21లో టెలికాం, డిజిటల్‌ వ్యాపారాల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్స్‌ (రూ.1,52,056 కోట్లు), రిలయన్స్‌ రిటైల్‌ సంస్థ (రూ.47,625 కోట్లు)ల్లో మైనార్టీ వాటాల విక్రయం ద్వారా సుమారు రూ.2 లక్షల కోట్లు, రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.53,124 కోట్లు, ఇంధన రిటైలింగ్‌లో 49 శాతం వాటా విక్రయం ద్వారా రూ.7629 కోట్లను కంపెనీ సమీకరించింది. ఫలితంగా లక్ష్యం (2021 మార్చి) కంటే ముందుగానే రుణ రహిత కంపెనీగా రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అవతరించింది.

'ఆర్‌బీఐ నుంచి గత ఏడాది అవసరమైన అనుమతులు తీసుకుని విదేశీ కరెన్సీ రూపంలోని 7.8 బిలియన్‌ డాలర్ల రుణాన్ని ముందుగానే చెల్లించేశాం. ఒక భారతీయ కార్పొరేట్‌ కంపెనీ ముందస్తుగా చెల్లించిన అత్యధిక రుణం ఇదే. ప్రపంచంలో గత పదేళ్లలో బ్యాంకింగేతర సంస్థల విభాగంలో జరిగిన అతి పెద్ద రైట్స్‌ ఇష్యూ కూడా మాదే. ఓ2సీ వ్యాపారంలో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్‌కోకు విక్రయించేందుకు సంప్రదింపులు జరుగుతున్నాయ'ని ఆర్​ఐఎల్ అధినేత ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.

ఇదీ చదవండి:2020-21లో ముకేశ్ అంబానీ జీతం 'సున్నా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.