కరోనా దేశంలో విలయతాండవం చేసినప్పటికీ రిలయన్స్ ఇండస్ట్రీస్(Reliance Industries).. గడిచిన ఏడాది కాలంలో అంచనాలకు మించి రాణించిందని ఆ సంస్థ ఛైర్మన్ ముకేశ్ అంబానీ(Mukesh Ambani) పేర్కొన్నారు. రిలయన్స్ 44వ వార్షిక సర్వసభ్య సమావేశం(RIL AGM)లో ఆయన మాట్లాడారు. అయితే, ఈ వృద్ధితో పోలిస్తే సంస్థ చేపట్టిన సహాయ కార్యక్రమాలే తనకు అత్యంత సంతృప్తినిచ్చాయని అన్నారు.
"గత ఏజీఎంతో పోలిస్తే ప్రస్తుతం మన వ్యాపారం అంచనాలను మించి రాణించింది. కానీ అత్యంత గడ్డు పరిస్థితుల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ చేపట్టిన మానవతా కార్యక్రమాలే నాకు ఎక్కువ సంతోషాన్నిచ్చాయి."
-ముకేశ్ అంబానీ, రిలయన్స్ ఛైర్మన్
ఇదే కార్యక్రమంలో మాట్లాడిన ముకేశ్ సతీమణి నీతా అంబానీ... కరోనా మహమ్మారి అత్యంత తీవ్రమైన సంక్షోభానికి దారి తీసిందని అన్నారు. మానవత్వానికి పరీక్ష పెట్టిందని చెప్పారు. అయితే, ఇలాంటి సమయంలోనూ ప్రజలందరూ కలిసికట్టుగా పోరాడారని పేర్కొన్నారు.