ETV Bharat / business

స్వతంత్ర సంస్థగా రిలయన్స్ ఓ2సీ విభాగం - ఆర్​ఐఎల్ ఓ2సీ విభాగం విడదీత

మాతృ సంస్థ నుంచి ఆయిల్​ టు కెమికల్ (ఓ2సీ) వ్యాపారాన్ని విడదీసి.. కొత్త యూనిట్​ను పూర్తి స్వతంత్ర కంపెనీగా మార్చనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్​ ప్రకటించింది. నూతన కంపెనీపై 100 శాతం నియంత్రణ అధికారాలు ఉంటాయని స్పష్టం చేసింది.

Reliance Reorganization
రిలయన్స్ నుంచి వేరుగా ఓ2సీ వ్యాపారం
author img

By

Published : Feb 23, 2021, 2:05 PM IST

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్​ఐఎల్​) కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్​ఐఎల్​ నుంచి ఆయిల్​ టు కెమికల్ (ఓ2సీ) వ్యాపారాన్ని పూర్తి స్వతంత్ర అనుబంధ కంపెనీగా విభజించనున్నట్లు ప్రకటించింది. అనుబంధ సంస్థలో ఆర్​ఐఎల్​ 100 శాతం నిర్వహణ, నియంత్రణ అధికారాలు కలిగి ఉండనుంది. స్టాక్ ఎక్స్ఛేంజీలకు ఈ విషయం తెలియచేసింది.

అన్ని రిఫైనరీ, మార్కెటింగ్​, కెమికల్ విభాగాల ఆస్తులను నూతన ఓ2సీ సంస్థకు బదిలీ చేయనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్​ పేర్కొంది.

కొత్తగా ఏర్పడే వ్యాపారాల్లో ప్రమోటర్​ గ్రూప్​ 49.14 శాతం వాటను కలిగి ఉండనుంది. ఈ ప్రక్రియతో కంపెనీ వాటాదారుల్లో ఎలాంటి మార్పులు ఉండవని తెలిపింది రిలయన్స్ ఇండస్ట్రీస్​. ప్రస్తుతం ఉన్న నిర్వహణ బృందం మొత్తం కొత్తగా ఏర్పడే సంస్థలోకి బదిలీ అవుతుందని స్పష్టం చేసింది. ఆదాయాల తగ్గింపు, క్యాష్​ ఫ్లోపై పరిమితులు ఉండవని వివరించింది.

ఓ2సీ వ్యాపారాల్లో 20 శాతం వాటాను సౌదీ ఆరామ్​కోకు విక్రయించేందుకు చర్చలు జరుగుతున్నట్లు ఆర్​ఐఎల్​ వెల్లడించింది.

ఇదీ చదవండి:2020లో 12.5% తగ్గిన స్మార్ట్​ఫోన్ల విక్రయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.