జస్ట్ డయల్‌లో 40.95 శాతం వాటా కొనుగోలు చేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్ శుక్రవారం ప్రకటించింది. దీని విలువ రూ.3,497 కోట్లుగా పేర్కొంది. వ్యాపార విస్తరణలో భాగంగా.. జస్ట్ డయల్‌ను సొంతం చేసుకోనున్నట్లు ఇటీవల వచ్చిన వార్తలు నిజమేనని తాజా ప్రకటనతో తేలిపోయింది.
ఓపెన్ ఆఫర్ ద్వారా అదనంగా 2.17 కోట్ల ఈక్విటీ షేర్లు.. సుమారు 26 శాతం వాటాను ఆర్ఆర్వీఎల్ స్వాధీనం చేసుకోనున్నట్లు రెగ్యులేటరీకి ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడైంది. ఓపెన్ ఆఫర్‌కు పూర్తి స్థాయి స్పందన లభిస్తే.. రిలయన్స్‌కు జస్ట్‌డయల్‌లో 66 శాతం వరకు వాటా లభిస్తుంది.
అతిపెద్ద వాటాదారుగా రిలయన్స్ స్థానం సంపాదించినప్పటికీ.. జస్ట్ డయల్ ఎండీ వీఎస్ఎస్ మణి.. సీఈఓగా, ఎండీగా కొనసాగనున్నారు. రిలయన్స్ వాటాతో వచ్చిన మూలధనం సంస్థ అభివృద్ధి, విస్తరణకు ఉపయోగపడుతుందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: అదరగొట్టిన జొమాటో.. ఐపీఓకు భారీ స్పందన