ETV Bharat / business

రియల్​మీ X ఐక్యూ: రెండు 5జీ స్మార్ట్​ఫోన్లలో ఏది బెటర్​? - ఐక్యూ 5జీ ఫోన్​ ఫీచర్లు

దేశ స్మార్ట్​ఫోన్ మార్కెట్లోకి ఒకేసారి రెండు 5జీ స్మార్ట్​ఫోన్లు విడుదలయ్యాయి. రియల్​మీ ఎక్స్​ 50 ప్రో, ఐక్యూ 3 మోడళ్లు వచ్చాయి. 5జీ స్మార్ట్​ఫోన్​ను కొనాలనుకునే వారికి ఏ కంపెనీ ఫోన్ ఉత్తమ ఎంపిక​? రెండు ఫోన్ల మధ్య తేడాలు, పోలికలు ఏంటి? అనే విషయాలు మీ కోసం.

which 5g phone is better to buy
5జీ ఫోన్లలో ఏది బెటర్
author img

By

Published : Feb 26, 2020, 2:28 PM IST

Updated : Mar 2, 2020, 3:24 PM IST

భారత్​లో ఒక రోజు తేడాతో రెండు 5జీ స్మార్ట్​ఫోన్లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. ఈ నెల 24న రియల్​మీ తొలుత ఎక్స్​50ప్రో పేరుతో తొలి 5జీ స్మార్ట్​ఫోన్​ను విడుదల చేసింది. మరుసటి రోజు వివో సబ్​ బ్రాండ్ ఐక్యూ నుంచి 'ఐక్యూ 3' పేరుతో 5జీ స్మార్ట్​ఫోన్ విడుదలైంది. ఈ రెండు సంస్థలు చైనాలోని బీబీకే ఎలక్ట్రానిక్స్​కు చెందినవే కావడం గమనార్హం.

ఒకే సారి రెండు 5జీ స్మార్ట్​ఫోన్లు విడుదలైన నేపథ్యంలో చాలా మందికి ఒకే సందేహం. రెండింటిలో ఏ ఫోన్ కొనాలి? ఏ ఫోన్​ ఫీచర్లు బెటర్​గా ఉన్నాయి? అని. అలాంటి సందేహాలన్నింటికీ సమాధానమే ఈ ప్రత్యేక కథనం.

ధరలు ఇలా..

రియల్​మీ ఎక్స్​50 ప్రోఐక్యూ3

6జీబీ ర్యామ్​+128జీబీ స్టోరేజీ

ధర రూ.37,999

8జీబీ ర్యామ్​+128 జీబీ స్టోరేజీ

రూ.36,990

8జీబీ ర్యామ్​+128జీబీ స్టోరేజీ

ధర రూ.39,999

8జీబీ ర్యామ్​+256జీబీ స్టోరేజీ

ధర రూ.39,990

12జీబీ ర్యామ్+ 256 జీబీ స్టోరేజీ

ధర రూ.44,999

12జీబీ ర్యామ్​+256జీబీ స్టోరేజీ

ధర రూ.44,990

రియల్​మీ స్మార్ట్​ఫోన్ల విక్రయాలు realme.com, ఫ్లిప్​కార్ట్​లలో ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

ఐక్యూ 3 అమ్మకాలు మార్చి 4న ప్రారంభం కానున్నాయి. iqoo.com, ఫ్లిప్​కార్ట్​ ద్వారా కొనుగోళ్లకు అందుబాటులో ఉండనున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్​ క్రెడిట్​ పేమెంట్స్​, ఈఎంఐలపై రూ.3,000 వరకు తగ్గింపు లభించనుంది.

డిస్​ప్లే:

  • 6.44 అంగుళాల ఫుల్‌హెచ్‌డీ+ 90Hz రీఫ్రెష్‌ రేట్‌ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను ఎక్స్​50 ప్రోలో పొందుపరిచింది రియల్​మీ.
  • ఐక్యూలో 6.44 ఇంచుల ఫుల్​ హెచ్​డీ+అమోలెడ్ డిస్​ప్లే ఉంది.
  • రెండు ఫోన్లలో ఇన్​డిస్​ప్లే ఫింగర్​ప్రింట్​ సెన్సర్​ ఉంది.

పోల్చి చూస్తే..

ఫీచర్లురియల్​మీ ఎక్స్​50 ప్రోఐక్యూ3
రియర్ ​కెమెరా

నాలుగు

(64ఎంపీ+8ఎంపీ+12ఎంపీ+2ఎంపీ)

నాలుగు

(48ఎంపీ+13ఎంపీ+13ఎంపీ+2ఎంపీ)

సెల్ఫీ కెమెరాడ్యూయల్​ (పంచ్​ హోల్) (32 ఎంపీ+8 ఎంపీ)16 ఎంపీ (పంచ్​ హోల్)
ప్రాసెసర్​క్వాల్కమ్​ 865 క్వాల్కమ్​ 865
బ్యాటరీ4,200 ఎంఏహెచ్‌4,440 ఎంఏహెచ్
ఫాస్ట్​ ఛార్జింగ్​ టైప్65 వాట్స్​ సూపర్‌ డార్ట్‌55 వాట్స్ ఫ్లాష్ ఛార్జింగ్
ఓఎస్ఆండ్రాయిడ్ 10 ఆండ్రాయిడ్ 10

చివరగా..

రియల్​మీ ఎక్స్​50 ప్రో ఫోన్​ కెమెరాలు, ఫాస్ట్​ ఛార్జింగ్​ విషయానికొస్తే కాస్త మెరుగ్గా ఉన్నాయి. ఓఎస్​, ప్రాసెసర్ విషయంలో రెండు ఫోన్లు ఒకే విధంగా ఉన్నాయి.

ఐక్యూ 3 ఫోన్​లో రియర్ కెమెరా తక్కువ సామర్థ్యంతో ఉన్నా.. 20 x జూమ్​ సదుపాయన్ని కల్పిస్తోంది. బ్యాటరీ విషయంలో ఐక్యూ 3 కొంచెం మెరుగ్గా ఉంది.

ఇదీ చూడండి:'తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వజ్రాలు అన్వేషణ'

Last Updated : Mar 2, 2020, 3:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.