ETV Bharat / business

రియల్​మీ నుంచి స్మార్ట్​టీవీ- ధరెంతో తెలుసా?

భారత మార్కెట్లోకి చైనా సంస్థ రియల్​మీ స్మార్ట్​ టీవీని ఆవిష్కరించింది. జూన్​ 2 నుంచి ఫ్లిప్​కార్టు, రియల్​మీ వెబ్​సైట్​లో అమ్మకాలు ప్రారంభించనుంది. జూన్​ 5 నుంచి స్మార్ట్​ వాచ్​ కూడా అందుబాటులోకి తీసుకురానుంది. వీటి ధరలతో పాటు ప్రత్యేకతలు మీకోసం..

Realme
రియల్​మీ
author img

By

Published : May 25, 2020, 11:25 PM IST

చైనా స్మార్ట్​ఫోన్​ సంస్థ రియల్​మీ.. టీవీ సెగ్మెంట్​లోకి అడుగుపెట్టింది. రియల్​మీ రూపొందించిన మొదటి స్మార్ట్​ టీవీని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్​ టీవీతో పాటు తక్కువ ధరలో స్మార్ట్ వాచ్​ను కూడా తీసుకొచ్చింది.

"రియల్​మీకి భారత మార్కెట్​ మొదటి ప్రాధాన్యం. 2020లో స్మార్ట్​ఫోన్ల​తో పాటు వివిధ రకాల ఇంటర్నెట్​ ఆఫ్ థింగ్స్​ ఉత్పత్తులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే స్మార్ట్ టీవీ, స్మార్ట్ వాచ్​, బడ్స్​ఎయిర్​ నియో, పవర్ బ్యాంకులను మార్కెట్లోకి విడుదల చేశాం."

- మాధవ్ సేఠ్​, రియల్​మీ ఇండియా సీఈఓ

రియల్​మీ స్మార్ట్ టీవీలు 32, 43 అంగుళాల వేరియంట్లలో రానున్నాయి. ఫ్లిప్​కార్ట్, రియల్​మీ.కామ్​​ వేదికగా జూన్​ 2 నుంచి అమ్మకాలను ప్రారంభించనుంది.

రియల్​మీ స్మార్ట్​ టీవీ ప్రత్యేకతలు..

  • మీడియా టెక్ 64 బిట్ క్వాడ్​ కోర్ ప్రాసెసర్
  • డోల్బీ ఆడియో సర్టిఫైడ్ 24డబ్ల్యూ క్వాడ్ స్టీరియో స్పీకర్లు
  • ఆండ్రాయిడ్​ ఆపరేటింగ్ సిస్టమ్​
  • నెట్​ఫ్లిక్స్​, యూట్యూబ్​, ప్రైమ్ వీడియో సపోర్ట్
  • హెచ్​డీ రెడీ స్క్రీన్​తో పాటు వివిడ్​ అనుభూతి

ధర..

  • 32 అంగుళాల టీవీ రూ.12,999
  • 43 అంగుళాల టీవీ రూ. 21,999

స్మార్ట్ వాచ్​..

స్మార్ట్ టీవీ తర్వాత జూన్​ 5 నుంచి స్మార్ట్ వాచ్​ అమ్మకాలు ప్రారంభించనుంది రియల్​మీ.

స్మార్ట్​ వాచ్​ ప్రత్యేకతలు..

  • 1.4 అంగుళాల కలర్ స్క్రీన్​
  • 2.5డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్​ 3 ప్రొటెక్షన్
  • ఐపీ68 వాటర్​ అండ్ డస్ట్ రెసిస్టెంట్​
  • 7- 9 రోజుల బ్యాటరీ సామర్థ్యం (పవర్​ సేవ్​ మోడ్​ ద్వారా 20 రోజులు)
  • రియల్​టైమ్​ హార్ట్​రేట్​ మానిటర్​
  • ఎస్​పీఓ-2(రక్తంలోని ఆక్సిజన్​ స్థాయి) మానిటర్
  • ధర రూ.3,999

ఎయిర్​నియో..

వీటితోపాటు వైర్​లెస్​ ఇయర్ బడ్స్​ 'ఎయిర్​ నియో'ను మే 25న అందుబాటులోకి తేనుంది రియల్​మీ. 17 గంటల బ్యాటరీ సామర్థ్యం దీని సొంతం. ధర రూ.2,999.

పవర్​ బ్యాంకు..

టూవే ఇన్​పుట్​, ఆవుట్​పుట్​​ పోర్టులతో పవర్​ బ్యాంకును కూడా ఆవిష్కరించింది రియల్​మీ. 10,000ఎంఏహెచ్, 18వాట్ల​ సామర్థ్యం ఉన్న ఈ పవర్​ బ్యాంకు రూ.999కే అందిస్తోంది. ఇందులో యూఎస్​బీ-ఏ, యూఎస్​బీ-సీ అవుట్​పుట్​ పోర్టు సౌకర్యం కల్పించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.