ETV Bharat / business

ఆర్​కామ్​కు అనిల్ అంబానీ రాజీనామా చెల్లదు! - ఆర్​కాం సంక్షోభం

ఆర్​కామ్​కు అనిల్ అంబానీ సహా నలుగురు డైరక్టర్ల రాజీనామాలు తిరస్కరణకు గురయ్యాయి. అ సంస్థ రుణదాతలు వారి రాజీనామాలను తిరస్కరించారు. దివాలా ప్రక్రియ పూర్తయ్యే వరకు అంతా సహకరించాలని సూచించారు.

ఆర్​కామ్​కు అనిల్ అంబానీ రాజీనామా చెల్లదు!
author img

By

Published : Nov 24, 2019, 3:38 PM IST

రిలయన్స్​ కమ్యూనికేషన్స్​ (ఆర్​కామ్​)కు అనిల్ అంబానీ రాజీనామాను రుణదాతలు తిరస్కరించారు. ప్రస్తుతం కొనసాగుతున్న దివాలా ప్రక్రియకు సహకరించాలని ఆయనకు సూచించారు.

అనిల్​ అంబానీతో పాటు .. ఇతర డైరెక్టర్లు ఛాయా వీరణి, రీనా కరణి, మంజరీ కాకర్, సురేశ్​ రంగాచర్​లు ఈ నెల ప్రారంభంలో రాజీనామా చేశారు. వీరందరి రాజీమాలను ఈ నెల 20న కమిటీ ఆఫ్ క్రెడిటర్స్​ (సీఓసీ)కి పంపినట్లు ఆర్​కామ్ బీఎస్​ఈకి నివేదించింది. అయితే వారి రాజీనామాలను సీఓసీ తిరస్కరించినట్లు నివేదికలో పేర్కొంది.

ఆర్​కామ్ సంక్షోభం ఇది..

ఆర్​కాం గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. రుణ భారంతో ఇప్పటికే మొబైల్​ సేవలు నిలిపివేసింది. 2019-20 రెండో త్రైమాసికంలో.. రూ.30,142 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. దేశీయ కార్పొరేట్​ చరిత్రలో ఇది రెండవ అతిపెద్ద త్రైమాసిక నష్టం.

వొడాఫోన్-ఐడియా ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. 2019-20 రెండో త్రైమాసికంలో ఈ సంస్థ ఏకంగా రూ.50,921 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. ఏజీఆర్ బకాయిలు చెల్లించాల్సిందేనని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో టెలికాం సంస్థలు ఈ స్థాయిలో నష్టాలను ప్రకటించాయి.

ఇదీ చూడండి:ఆ కొత్త ఫోన్లలో 17 నిమిషాలకే బ్యాటరీ ఫుల్​!

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.