ETV Bharat / business

యెస్​ బ్యాంక్​పై మారటోరియం- సగం వాటా ఎస్బీఐకి!

మదుపరులకు ఎంతో ఇష్టమైన యెస్​ బ్యాంకుపై భారత రిజర్వ్ బ్యాంక్ మారటోరియం విధించింది. ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణపై ఆంక్షలు విధించింది. పునరుజ్జీవ ప్రణాళిక అంటూ ఏదీ లేకపోవటం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపింది. యెస్​ బ్యాంకులో వాటా కొనుగోళ్లకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తున్న నేపథ్యంలో ఎస్బీఐ సగం దక్కించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

yes bank
యెస్​ బ్యాంకు
author img

By

Published : Mar 6, 2020, 7:48 AM IST

యెస్‌ బ్యాంకుపై మారటోరియం విధిస్తూ గురువారం రాత్రి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు జారీ చేసింది. ఖాతాదార్లకు నెలకు రూ.50,000 మాత్రమే ఒక్కో ఖాతా నుంచి నగదు ఉపసంహరణకు వీలుంటుందని తెలిపింది. అదే సమయంలో తక్షణం యెస్‌ బ్యాంకు బోర్డును రద్దు చేసింది. అడ్మినిస్ట్రేటర్‌గా ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ ప్రశాంత్‌ కుమార్‌ను నియమించింది.

పునరుజ్జీవ ప్రణాళికల్లో విఫలమవటం వల్ల బ్యాంకు డిపాజిటర్ల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆర్‌బీఐ ఒక నిర్ణయానికి వచ్చింది. బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్‌-1949 సెక్షన్‌ 45 కింద యెస్‌ బ్యాంకుపై మారటోరియం విధించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవించడం తప్ప ప్రత్యామ్నాయం కనిపించడం లేద’ని ఆర్‌బీఐ గురువారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది.

"ఆ బ్యాంకు పలు పెట్టుబడిదార్లతో చర్చలు జరిపినప్పటికీ ఏదీ ఫలవంతం కాలేదు. సరిపోయినంత సమయం ఇచ్చినా విశ్వసించదగ్గ పునరుజ్జీవ ప్రణాళికతో ముందుకు రాలేకపోయింది."

- ఆర్బీఐ ప్రకటన

ఎస్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థలు యెస్‌ బ్యాంకులో వాటాను కొంటున్నాయని..బెయిల్‌ అవుట్‌ ప్రకటిస్తాయని వార్తలు వచ్చిన గంటల్లోనే ఆర్‌బీఐ ఈ చర్యలను చేపట్టడం గమనార్హం.

పరుగులు తీసిన షేర్లు..

ఉదయం వార్తల నేపథ్యంలో యెస్‌ బ్యాంకు షేర్లు కళకళలాడాయి. గురువారం బీఎస్‌ఈలో ఏకంగా 25.77%(రూ.7.55) దూసుకెళ్లి రూ.36.85 వద్ద ముగిశాయి. ఒక దశలో రూ.37.90 వద్ద గరిష్ఠ స్థాయినీ చేరింది. ఎన్‌ఎస్‌ఈలోనూ ఈ షేరు 25.6%(రూ.7.50) లాభంతో రూ.36.80 వద్ద స్థిరపడింది.

షేరు లక్ష్యం రూపాయే..

తాజా పరిణామాల నేపథ్యంలో అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ జేపీ మోర్గాన్‌ యెస్‌ బ్యాంకు షేరు లక్ష్యాన్ని రూ.1గా అంచనా కట్టింది. డిపాజిట్ల నష్టాలు, ఒత్తిడిలో ఉన్న రుణ పుస్తకానికి సంబంధించిన నష్టభయాల కారణంగా బ్యాంకులో వాటాను దాదాపు సున్నా విలువతో ఇన్వెస్టర్లు కొంటారని అది అంచనా కట్టింది. ఇది ప్రభుత్వం ఇస్తున్న సార్వభౌమ(‘ఎస్‌బీఐ/ఎల్‌ఐసీల ద్వారా) సహాయంగా భావించాలి. బాండ్‌ హోల్డర్లకు లేదా డిపాజిటర్లకు ఇది బెయిల్‌ అవుట్‌గా భావించాలి. అంతే తప్ప మార్కెట్‌ వర్గాలకు కాదు. కాబట్టి గురువారం యెస్‌ బ్యాంకు షేరు 26 శాతం పెరగడం అసంబద్ధ చర్యగానే భావించాల’ని ఆ బ్రోకరేజీ అంటోంది.

yes bank
యెస్ బ్యాంకు షేర్లు

సగం వాటా ఎస్‌బీఐకి!

యెస్‌ బ్యాంకులో వాటా కొనుగోలుకు రంగం సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఆ మేరకు ఎస్‌బీఐ, ఇతర ఆర్థిక సంస్థల ప్రతిపాదనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ వాటా కొనుగోలులో ఎల్‌ఐసీని కూడా పాల్గొనాలని ఎస్‌బీఐ కోరినట్లు సమాచారం. ఎల్‌ఐసీకి ఇప్పటికే యెస్‌ బ్యాంకులో 8 శాతం వరకు వాటా ఉండడం ఇందుకు నేపథ్యం.

కొన్ని వారాల కిందటే సంకేతాలు..

ఈ పరిణామాలు గత కొన్ని వారాల కిందట జరిగిన సంఘటనకు బలం చేకూరుస్తోంది. సమస్యలో ఉన్న బ్యాంకును వైఫల్యం కాకుండా చూడాల్సిన బాధ్యత ఉందని యెస్‌ బ్యాంకుపై ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అప్పట్లోనే వ్యాఖ్యానించారు. అయితే యెస్‌ బ్యాంకును టేకోవర్‌ చేయడానికి కోటక్‌ మహీంద్రా బ్యాంకు సరైనదని కొద్ది నెలల కిందట ఈయనే వ్యాఖ్యానించడం గమనార్హం.

అప్పుడు అవి.. ఇప్పుడు ఇది

ఒకవేళ ప్రస్తుతం వస్తున్న వార్తలు వాస్తవరూపం దాలిస్తే ఒక ప్రైవేటు రంగ బ్యాంకుకు ఒక ప్రభుత్వ రంగ బ్యాంకు బెయిల్‌ అవుట్‌ ఇవ్వడం చాలా ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి అవుతుంది. 2004లో గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంకును ఓబీసీ; 2006లో యునైటెడ్‌ వెస్ట్రన్‌ బ్యాంకును ఐడీబీఐ బ్యాంకు టేకోవర్‌ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవేటు సంస్థలకు బెయిల్‌ అవుట్‌ ఇవ్వడానికి ప్రజాధనాన్ని ఉపయోగించడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి.

ఇవీ వార్తలు..

యెస్‌ బ్యాంకులో నియంత్రిత వాటాను కొనుగోలు చేయడానికి ఎస్‌బీఐ ఆధ్వర్యంలోని కన్సార్షియం ఇచ్చిన ప్రతిపాదనకు ప్రభుత్వం ఆమోద ముద్ర తెలిపిందని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే గురువారం ముంబయిలో జరిగిన ఎస్‌బీఐ బోర్డు సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చిందా లేదా అన్నది తెలియరాలేదు.

ఇలా చేయాల్సి వస్తుంది..

యెస్‌ బ్యాంకులో వాటాను కొనుగోలు చేయాలంటే స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యాక్ట్‌లో కూడా సవరణలు చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం పార్లమెంటులో జరుగుతున్న బడ్జెట్‌ సమావేశాలు ఈ సవరణలకు ఆమోదం తెలపడానికి ప్రభుత్వాన్ని అవకాశాన్ని ఇస్తాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్‌ ఆర్‌ గాంధీ యెస్‌ బ్యాంకు బోర్డులో ఉండడం గమనించదగ్గ విషయం.

బ్యాంకులు ఏమంటున్నాయంటే..

ఏవైనా పరిణామాలు ఉంటే సెబీ నిబంధనల ప్రకారం.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇస్తామని ఎస్‌బీఐ తెలిపింది. ఆర్‌బీఐ లేదా ప్రభుత్వం లేదా నియంత్రణ సంస్థలు లేదా ఎస్‌బీఐ నుంచి ఎటువంటి సమాచారం ప్రస్తుతానికైతే అందలేని యెస్‌ బ్యాంకు కూడా స్పష్టం చేసింది. ‘అలాంటి నిర్ణయం జరిగిందో లేదే తెలియదు. కాబట్టి అటువంటి వార్తలపై మేం స్పందించలేమ’ని స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు యెస్‌ బ్యాంకు తెలిపింది. ఈ వార్తలపై ఎక్స్ఛేంజీలు నివేదికను కోరడం ఇందుకు నేపథ్యం. ఏవైనా పరిణామాలుంటే ఎక్స్ఛేంజీలకు చెబుతామని యెస్‌ బ్యాంకు కూడా తెలిపింది.

యెస్​ బ్యాంకు ప్రస్థానం..

  • ఒకప్పుడు మదుపర్లకు ఎంతో ఇష్టమైన యెస్‌ బ్యాంకు గత మార్చిలో కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రవ్‌నీత్‌ గిల్‌ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కష్టాల్లోకి వెళ్లింది.
  • జనవరి 31, 2019 కల్లా బ్యాంకును వీడాలని అప్పటి చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రాణా కపూర్‌ను ఆగస్టు 2018న ఆర్‌బీఐ ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి యెస్‌ బ్యాంకుకు గ్రహణం పట్టింది.
  • పాలన, రుణాలపై ఆందోళనలు బ్యాంకును చుట్టుముట్టాయి. రాణాకపూర్‌ అనంతరం పగ్గాలు చేపట్టిన రవ్‌నీత్‌ గిల్‌ నేతృత్వంలోనూ ఆ కష్టాలు వీడలేదు. రుణ పుస్తకంపై భారీ ఒత్తిడి పడింది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2 బి. డాలర్ల నిధులను సమీకరించాలని బ్యాంకు భావించింది. అయితే కెనడా ఇన్వెస్టర్‌ అయిన ఎస్‌పీజీపీ గ్రూప్‌/ఎర్విన్‌సింగ్‌బ్రెయిక్‌ బ్యాంకులో 1.2 బి. డాలర్ల పెట్టుబడులు పెట్టడానికి బ్యాంకు బోర్డు తిరస్కరించింది.
  • సంక్షోభంతో డిసెంబరు 2019 త్రైమాసిక ఫలితాలను బ్యాంకు వాయిదా వేసింది. రూ.400 గరిష్ఠ స్థాయిని చేరిన షేరు 80% క్షీణించింది.
  • నిరర్థక ఆస్తుల కారణంగా బ్యాంకు మూలధన నిల్వలు కూడా కరుగుతూ వస్తున్నాయి. మార్చి 2019 త్రైమాసికంలో తొలి నష్టాలను ప్రకటించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.