ప్రముఖ బైక్ ట్యాక్సీ సేవల సంస్థ ర్యాపిడో మల్టీ పాయింట్ ట్రిప్ సేవలను ప్రారంభించింది. హైదరాబాద్, దిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్కతా, జైపుర్ నగరాల్లో ఈ తరహా సేవలను అందుబాటులోకి తెచ్చింది.
ఏమిటీ మల్టీ పాయింట్ ట్రిప్?
ప్రస్తుతం ఒకసారి రైడ్ బుక్ చేసుకుంటే.. ఒక గమ్యస్థానానికి వెళ్లేందుకు మాత్రమే ట్యాక్సీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఒక వ్యక్తికి వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పనులు ఉండొచ్చు. అలాంటి వారి కోసం.. ఒకే సారి గంట, రెండు గంటల (ఆరు గంటల వరకు) ప్యాకేజీల చొప్పున రైడ్ బుక్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది ర్యాపిడో. దీనితో రైడ్ బుక్ చేసుకున్న వ్యక్తి నిర్ణీత సమయంలో (బుక్ చేసుకున్న సమయంలో) ఎన్నిసార్లైనా.. ట్యాక్సీని ఆపి పని పూర్తి చేసుకుని.. మళ్లీ వేరొక చోటుకు వెళ్లే వీలుండనుంది. ఈ రైడ్ ప్రారంభమైనప్పటి నుంచి ముగిసే వరకు ర్యాపిడో డ్రైవింగ్ పార్ట్నర్ బుక్ చేసుకున్న వ్యక్తితో పాటే ఉంటాడు.
ఇదీ చదవండి:ఎడాపెడా పెట్రో బాదుడు- చొరవ చూపేదెన్నడు?