ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ నోకియా అధ్యక్షుడు, సీఈఓ బాధ్యతల నుంచి భారతీయ వ్యాపారవేత్త రాజీవ్ సూరి తప్పుకోనున్నారు. ఆయన స్థానంలో పెక్కా లూండ్మార్క్ను నోకియా బోర్డ్ డైరెక్టర్లు నియమించారు. లూండ్మార్క్ ఈ ఏడాది సెప్టెంబర్ 1న బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ఓ ప్రకటనలో పేర్కొంది నోకియా.
-
Pekka Lundmark appointed President and CEO of Nokia; Rajeev Suri to step down after more than a decade as President and CEO of Nokia and Nokia Siemens Networks. @PekkaLundmark is expected to start in his new role on September 1, 2020. https://t.co/umjmnhYm7R pic.twitter.com/XebUf3tt0O
— Nokia (@nokia) March 2, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Pekka Lundmark appointed President and CEO of Nokia; Rajeev Suri to step down after more than a decade as President and CEO of Nokia and Nokia Siemens Networks. @PekkaLundmark is expected to start in his new role on September 1, 2020. https://t.co/umjmnhYm7R pic.twitter.com/XebUf3tt0O
— Nokia (@nokia) March 2, 2020Pekka Lundmark appointed President and CEO of Nokia; Rajeev Suri to step down after more than a decade as President and CEO of Nokia and Nokia Siemens Networks. @PekkaLundmark is expected to start in his new role on September 1, 2020. https://t.co/umjmnhYm7R pic.twitter.com/XebUf3tt0O
— Nokia (@nokia) March 2, 2020
సీఈఓ, అధ్యక్ష పదవుల నుంచి భవిష్యత్తులో తప్పుకుంటానని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు తొలుత సూచించారు సూరి. ఈ నేపథ్యంలో సూరి వారసుడి కోసం ఆయనతో కలిసి విస్తృత చర్చలు సాగించారు డైరెక్టర్లు. ఈ ప్రక్రియ లూండ్మార్క్ ఎంపికతో పూర్తయిందని నోకియా వర్గాలు తెలిపాయి.
"2020 ఆగస్టు 31న ప్రస్తుత స్థానం నుంచి సూరి వైదొలుగుతారు. 2021 జనవరి 1 వరకు నోకియా బోర్డుకు సలహాదారుగా వ్యవహరిస్తారు."
- నోకియా ప్రకటన
లూండ్మార్క్ ప్రస్థానం..
లూండ్మార్క్ ప్రస్తుతం ఫిన్లాండ్కు చెందిన ఇంధన రంగ సంస్థ ఫోర్టమ్కు సీఈఓ, అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంతకుముందు కోన్క్రేన్స్కు సీఈఓ, అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1990-2000 మధ్య కాలంలో నోకియాలో అనేక స్థానాల్లో పనిచేశారు లూండ్మార్క్. నోకియా స్ట్రేటజీ, వ్యాపార అభివృద్ధి విభాగానికి ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.
సూరి స్పందన...
"నోకియాతో 25 ఏళ్ల అనుబంధం తర్వాత ఏదో కొత్తగా చేయాలనిపిస్తోంది. నాలో నోకియా ఎప్పటికీ భాగంగానే ఉంటుంది. సంస్థను ఈ స్థితికి తీసుకొచ్చేందుకు నాతోపాటు కృషి చేసిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు."
-రాజీవ్ సూరి, నోకియా సీఈఓ