చైనా టెలికాం దిగ్గజం హువావేకు 4జీ మొబైల్ చిప్సెట్లు విక్రయించేందుకు క్వాల్కమ్కు అమెరికా ప్రభుత్వం నుంచి లైసెన్స్ లభించింది.
4జీ చిప్సెట్లు సహా కొన్ని ఇతర సాంకేతికతల విక్రయానికి అనుమతి లభించినట్లు క్వాల్కమ్ అధికార ప్రతినిధి తెలిపారు. అయితే అవేమిటి అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ఇంకా చాలా ఉత్పత్తుల విక్రయాల విషయంలో అమెరికా ప్రభుత్వం వద్ద దరఖాస్తులు పెండింగ్లో ఉన్నట్లు వివరించారు.
వాణిజ్య విబేధాల కారణంగా.. క్వాల్కమ్ సహా తమ దేశానికి చెందిన ఇతర సెమీ కండక్టర్ కంపెనీలు.. చైనా టెక్ కంపెనీలకు సాకేతికతలను విక్రయించడాన్ని సెప్టెంబర్లో నిలిపివేసింది అమెరికా.
ఇదీ చూడండి:కరోనా తర్వాత ఇంధన గిరాకీలో వార్షిక వృద్ధి