ఉగ్రవాదం, మతోన్మాదం వంటి వాటికి సామాజిక మాధ్యమాలు వేదికలుగా మారకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. రాజ్యంగ పవిత్రతను కాపాడాలని సూచించారు.
కొత్త ప్రభుత్వంలో మరోసారి కేంద్ర ఐటీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రవి శంకర్. గతంలో కూడా ఆయన సామాజిక మాధ్యమాలకు పలు హెచ్చరికలు చేశారు.
అయితే, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇది రాజ్యంగం కల్పించిన హక్కు అని..అయితే వీటికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని రవి శంకర్ అన్నారు.
డేటా భద్రత చట్టానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అయితే త్వరలో జరగబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తారా లేదా అనే విషయాన్ని వెల్లడించలేదు.
17వ లోక్సభ తొలి విడత సమావేశాలు జూన్ 17న ప్రారంభం కానున్నాయి.