ETV Bharat / business

కోలుకున్న పీఎన్​బీ- 65% తగ్గిన నష్టాలు - తగ్గిన మొండి రుణాలు

గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు రూ. 4,750 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2018-19 క్యూ4లో బ్యాంకు నష్టాలు 65 శాతం తగ్గాయి.

పీఎన్​బీ
author img

By

Published : May 28, 2019, 4:47 PM IST

ప్రభుత్వ రంగ పంజాబ్​ నేషనల్ బ్యాంకు(పీఎన్​బీ) 2018-19 చివరి త్రైమాసికంలో రూ. 4,750 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంతో పోలిస్తే బ్యాంకు నష్టాలు 65 శాతం తగ్గాయి. 2017-18 చివరి త్రైమాసికంలో రూ.13,417 కోట్ల నష్టాన్ని ప్రకటించింది పీఎన్​బీ.

వజ్రాల వ్యాపారులు నీరవ్​ మోదీ, మోహుల్ చోక్సీల కుంభకోణంతో బ్యాంకు భారీ నష్టాలను మూటగట్టుకుంది.

మొండి రుణాలకు కేటాయించే మొత్తాలు తగ్గడం, స్థూల నిరర్ధక ఆస్తులు మెరుగవడం కారణంగా గడచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో బ్యాంకు నష్టాలు 65 శాతం తగ్గాయని పీఎన్​బీ పేర్కొంది.

2017-18 క్యూ4లో 18.38 శాతంగా ఉన్న బ్యాంకు స్థూల నిరర్ధక ఆస్తులు 2018-19లో 15.50 శాతానికి తగ్గాయి.

2018-19 ఆర్థిక సంవత్సరం క్యూ4లో మొత్తం ఆదాయం రూ.14,725.13 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే సమయానికి బ్యాంకు ఆదాయం రూ.12,945.68 కోట్లుగా ఉంది.

పూర్తి సంవత్సర లెక్కలివి

పూర్తి సంవత్సరానికి పీఎన్​బీ ఏకీకృత నికర నష్టం రూ. 9,570.11 కోట్లుగా ఉండగా.. 2019-18లో రూ.12,113.53 కోట్లుగా ఉంది.

2018-19 ఆర్థిక సంవత్సరానికి బ్యాంకు మొత్తం ఆదాయం రూ.59,514.53 కోట్లుగా నమోదైంది. 2017-18లో మొత్తం ఆదాయం రూ.57,608.19 కోట్లుగా ఉంది.

2018-19 పూర్తి ఆర్థిక సంవత్సరానికి పీఎన్​బీ స్థూల నిరర్ధక ఆస్తుల విలువ 6.56 శాతం తగ్గి రూ.78,472.70 కోట్లకు చేరింది. 2017-18లో వీటి విలువ రూ.86,620.05 కోట్లుగా ఉంది.

ఇదీ చూడండి: బడా రుణ ఎగవేతదారుల పేర్లు ఇవ్వండి: సీఐసీ

AP Video Delivery Log - 0900 GMT News
Tuesday, 28 May, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0844: China MOFA Briefing AP Clients Only 4212918
DAILY MOFA BRIEFING
AP-APTN-0817: Belgium EU Morning AP Clients Only 4212914
Morning scenes as leaders gather for EU Summit
AP-APTN-0814: US OH Large Tornado Must Credit WKEF/WRGT, No Access Dayton, No Use US Broadcast Networks 4212910
'Large and dangerous' tornado slams southwest Ohio
AP-APTN-0814: Kosovo Tension Do No Obscure Logo 4212912
Serbian troops on alert after Kosovo arrests
AP-APTN-0812: Kosovo Arrests No Access Serbia 4212911
Tensions rise after Kosovo police arrest Serbs
AP-APTN-0744: France D Day The Liberated AP Clients Only 4212909
Normandy village remains enduring symbol of D-Day
AP-APTN-0734: France D Day Cemetery AP Clients Only 4212907
Normandy cemetery maintained to 'highest standard'
AP-APTN-0718: Japan Stabbing Witnesses 2 AP Clients Only 4212906
Witnesses describe stabbing attack in Japan
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.