ETV Bharat / business

పీఎంసీ బ్యాంక్​ అక్రమాల కేసులో ఈడీ సోదాలు

పీఎంసీ బ్యాంక్​ కుంభకోణంలో అక్రమార్కుల పనిబట్టేందుకు ఈడీ రంగంలోకి దిగింది. మనీలాండరింగ్ కేసు నమోదుచేసి, ముంబయిలోని 6 చోట్ల సోదాలు చేపట్టింది.

author img

By

Published : Oct 4, 2019, 1:55 PM IST

పీఎంసీ బ్యాంక్​ అక్రమాల కేసులో ఈడీ సోదాలు

భారతీయ బ్యాంకింగ్​ రంగాన్ని ఒక్కసారిగా కుదిపేసిన పీఎంసీ కుంభకోణంపై ఎన్​ఫోర్స్​మెంట్​ డైరక్టరేట్​ దర్యాప్తు ప్రారంభించింది. ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం ఎఫ్​ఆఐర్​ ఆధారంగా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది ఈడీ. సాక్ష్యాధారాల కోసం ముంబయిలోని 6 ప్రదేశాల్లో సోదాలు చేసింది.

ఇదీ కేసు...

పీఎంసీ బ్యాంక్ అధికారులు, హౌసింగ్​ డెవలప్​మెంట్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్-హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు కుమ్మక్కయి భారీ స్థాయిలో రుణ అక్రమాలకు పాల్పడ్డారన్నది ప్రధాన ఆరోపణ. ఈ అప్పుల వివరాలను ఆర్బీఐకి చెప్పకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు దాచిపెట్టి.... నకిలీ ఖాతాలతో మోసగించారని ప్రాథమిక విచారణలో తేలింది. ఇలా పీఎంసీ బ్యాంక్​ నుంచి హెచ్​డీఐఎల్​ ప్రమోటర్లు రూ.6,500కోట్లు కాజేసినట్లు సమాచారం.

ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చాక పీఎంసీ బ్యాంక్ కార్యకలాపాలపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. భారతీయ బ్యాంకింగ్ రంగ షేర్లు స్టాక్​మార్కెట్లలో తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి.

ఇదీ చూడండి: గృహ, వాహన రుణగ్రహీతలకు శుభవార్త

New Delhi, Oct 04 (ANI): Union Railways Minister Piyush Goyal, Union Minister for Health and Family Welfare Harsh Vardhan flagged off 'Sarbat Da Bhalla Express' from New Delhi railway station on October 04. Union Cabinet Minister of Food Processing Harsimrat Kaur Badal was also present on this occasion. New Delhi-Ludhiana Intercity will now be known as Sarbat Da Bhalla Express. It will ply till Lohian Khas in Punjab.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.