ETV Bharat / business

'ఈ నెలలో 20 కోట్ల మలేరియా మాత్రలు ఉత్పత్తి'

కరోనా నేపథ్యంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కు పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా దేశీయ సంస్థలు ఉత్పత్తిని భారీగా పెంచాయి. ఈ నెలలో 20 కోట్ల ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేశామని ఔషధ సంస్థలు తెలిపాయి. దేశ అవసరాలతో పాటు ఎగుమతులకూ సరిపడా నిల్వలు ఉన్నట్లు స్పష్టం చేశాయి.

hydroxychloroquine
హైడ్రాక్సీ క్లోరోక్విన్
author img

By

Published : Apr 11, 2020, 8:33 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

మందు, వ్యాక్సిన్ లేని కరోనా వైరస్ చికిత్సకు ప్రస్తుతం హైడ్రాక్సీ క్లోరోక్విన్ పైనే ప్రపంచ దేశాలన్నీ ఆధారపడ్డాయి. మలేరియాకు ఉపయోగించే ఔషధం ఉత్పత్తి చేసే దేశాల్లో భారత్ మొదటిస్థానంలో ఉంది. ఈ పరిస్థితుల్లో చాలా దేశాలు భారత్ వైపు చూస్తున్నాయి.

తొలుత ఈ మందు ఎగుమతులపై నిషేధం విధించినా.. మిత్ర దేశాల ఒత్తిడి నేపథ్యంలో మానవతా దృక్పథంతో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఎగుమతులకు అంగీకరించింది భారత్. అయితే మన దేశంలోనూ కేసులు పెరుగుతున్న వేళ స్థానిక అవసరాలు, ఎగుమతులను దృష్టిలో పెట్టుకుని ఈ ఔషధాన్ని భారీగా ఉత్పత్తి చేస్తున్నాయి దేశీయ సంస్థలు.

భారీగా ఉత్పత్తి..

ఈ నెలలో 20 కోట్లు ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేశామని జైడస్ కాడిలా సంస్థ సీఈఓ పంకజ్ పటేల్ తెలిపారు.

"హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఉత్పత్తిని ఫార్మా సంస్థలు గణనీయంగా పెంచాయి. ఈ నెలలో 20 కోట్ల ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేశాయి. దేశీయ, విదేశాల అవసరాలకు సరిపడేలా 30 టన్నుల ఏపీఐను కాడిలా సిద్ధం చేయనుంది. ఫలితంగా వచ్చే నెలలో 15 కోట్ల ట్యాబ్లెట్లను ఉత్పత్తి చేస్తాం."

- పంకజ్ పటేల్, జైడస్ కాడిలా సీఈఓ

నిల్వలూ ఉన్నాయ్..

అంతేకాకుండా.. తగినంత హైడ్రాక్సీ నిల్వలు ఉన్నట్లు పంకజ్ తెలిపారు. దేశీయ అవసరాలతో పాటు ప్రపంచానికి సరిపడా మొత్తంలో భారత్ ఉత్పత్తి చేయగలదని ఆయన అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా వస్తోన్న అభ్యర్థనల దృష్ట్యా మొదటిగా 13 దేశాలకు ఎగుమతి చేసింది. ఇందులో అమెరికా, స్పెయిన్, జర్మనీ, బహ్రెయిన్, బ్రెజిల్, నేపాల్, భూటాన్, శ్రీలంక, అఫ్గానిస్థాన్, మాల్దీవులు, బంగ్లాదేశ్ తదితర దేశాలు ఉన్నాయి. అమెరికా 48 లక్షల ట్యాబ్లెట్లు కావాలని కోరగా.. 35.82 లక్షల మాత్రలను విడుదల చేసింది.

ఇదీ చూడండి: 'దేశంలో సరిపడ క్లోరోక్విన్​ నిల్వలు ఉన్నాయ్'

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.