అంతర్జాతీయంగా పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో వరుసగా ఎనిమిదో రోజు దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర నేడు 22 పైసలు పెరిగి.. రూ.74.13కి చేరింది. లీటర్ డీజిల్ ధర 14 పైసలు పెరిగింది. ప్రస్తుతం రూ.67.07 వద్ద ఉంది.
దేశంలోని పలు ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.80కి చేరువలో ఉండగా.. లీటర్ డీజిల్ ధర రూ.70 దాటింది.
నరగాల వారీగా పెట్రో ధరలు..
నగరం | పెట్రోల్(లీ) | డీజిల్(లీ) |
ముంబయి | రూ.79.77 | రూ.70.34 |
హైదరాబాద్ | రూ.78.77 | రూ.73.08 |
చెన్నై | రూ.77.03 | రూ.70.88 |
కోల్కతా | రూ.76.79 | రూ.69.46 |
ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి సంస్థ అయిన.. ఆరాంకో చమురు శుద్ధి కేంద్రంపై హౌతీ తిరుగుబాటుదార్లు చేసిన డ్రోన్ దాడితో అంతర్జాతీయంగా చమురు సంక్షోభం మొదలైంది. ఈ దాడితో ప్రపంచవ్యాప్తంగా 5శాతం ఉత్పత్తి తగ్గి.. ముడి చమురు ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి.
నెలాఖరుకు ఉత్పత్తిని పునరుద్ధరిస్తామని ఆరాంకో ప్రతినిధులు చెబుతున్నా చమురు ధరలపై అనిశ్చితులు తొలగటం లేదు.
ఇదీ చూడండి: ఆర్థిక సంక్షోభంతో 178 ఏళ్ల నాటి కంపెనీ దివాలా!