గడచిన 11 ఆర్థిక సంవత్సరాల్లో రూ.2.05 లక్షల కోట్లు విలువైన బ్యాంకు మోసాలు జరిగినట్లు బ్యాంకింగ్ నియంత్ర సంస్థ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 2008-09 నుంచి 2018-19 మధ్య మొత్తం 53,334 బ్యాంకు మోసాల కేసులు నమోదైనట్లు ఓ ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ వెల్లడించింది.
ఐసీఐసీఐ బ్యాంకు అత్యధికంగా 6,811 కేసుల్లో రూ. 5,033.81 కోట్లు మోసపోయింది. ఆ తర్వాతి స్థానంలో ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐకి 6,793 కేసుల్లో రూ.23.734.74 కోట్లు నష్టం జరిగిందని వెల్లడించింది రిజర్వు బ్యాంక్.
ఇతర ప్రధాన బ్యాంకుల మోసాల లెక్కలు ఇలా...
- హెచ్డీఎఫ్సీ బ్యాంకు - కేసులు-2,497 -- మొత్తం సొమ్ము- రూ.1,200.79 కోట్లు
- బ్యాంక్ ఆఫ్ బరోడా - కేసులు-2,160 -- మొత్తం సొమ్ము-రూ.12,962.96 కోట్లు
- పంజాబ్ నేషనల్ బ్యాంకు- కేసులు-2,047 -- మొత్తం సొమ్ము-రూ.28,700.74 కోట్లు
- యాక్సిస్ బ్యాంకు - కేసులు-1,944 -- మొత్తం సొమ్ము-రూ.12,358.2 కోట్లు
- బ్యాంక్ ఆఫ్ ఇండియా - కేసులు-1,872 -- మొత్తం సొమ్ము-రూ.12,358.2 కోట్లు
- సిండికేట్ బ్యాంకు - కేసులు-1,783 -- మొత్తం సొమ్ము-రూ.5,830.85 కోట్లు
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా - కేసులు-1,613 -- మొత్తం సొమ్ము-రూ.9,041.98 కోట్లు
- ఐడీబీఐ బ్యాంకు - కేసులు-1,264 -- మొత్తం సొమ్ము-రూ.5,978.96 కోట్లు
- స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు - కేసులు-1,263 -- మొత్తం సొమ్ము-రూ.1,221.41 కోట్లు
- కెనరా బ్యాంకు - కేసులు-1,254 -- మొత్తం సొమ్ము-రూ.5,553.38 కోట్లు
- యూనియన్ బ్యాంక్ - కేసులు-1,244 -- మొత్తం సొమ్ము-రూ.11,830.74 కోట్లు
- కోటక్ బ్యాంకు - కేసులు-1,213 -- మొత్తం సొమ్ము-రూ. 430.46 కోట్లు
- ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు- కేసులు-1,115 -- మొత్తం సొమ్ము-రూ. 12,644.7 కోట్లు
- యూకో బ్యాంకు - కేసులు-1,081 -- మొత్తం సొమ్ము -రూ.7,104.77 కోట్లు
- ఓరియంటల్ బ్యాంకు - కేసులు-1,040 -- మొత్తం సొమ్ము-రూ. 5,598.23 కోట్లు
- విజయా బ్యాంకు - కేసులు-639 -- మొత్తం సొమ్ము-రూ.1,748.9 కోట్లు
- లక్ష్మీ విలాస్ బ్యాంకు - కేసులు-259 -- మొత్తం సొమ్ము-రూ.862.64 కోట్లు
- ఎస్ బ్యాంకు - కేసులు-102 -- మొత్తం సొమ్ము-రూ. 311.96 కోట్లు
5,916 బ్యాంకు మోసాలు అత్యధికంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో నమోదయ్యాయి. వీటి విలువ రూ.41.167.03 కోట్లుగా ఉన్నట్లు ఆర్బీఐ పేర్కొంది.
వీటితో పాటు అమెరికన్ ఎక్స్ప్రెస్, సిటీ యూనియన్ బ్యాంకు, హెచ్ఎస్బీసీ, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాంట్ వంటి విదేశీ బ్యాంకుల్లో మొత్తం 5,015 కేసులు నమోదైనట్లు తెలిపింది. వీటి వల్ల ఆయా బ్యాంకులు రూ.989.09 కోట్లు మోసపోయినట్లు వెల్లడించింది.
ఇదీ చూడండి: నీరవ్ మోదీకి నాల్గో సారి బెయిల్ నిరాకరణ