ETV Bharat / business

ఆ రంగులతో మరింత స్టైలిష్​గా ఓలా ఈ-స్కూటర్​!

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్​కు సంబంధించి మరో అప్​డేట్​ వచ్చింది. పది విభిన్న రంగుల్లో ఈ స్కూటర్​ను విపణిలోకి ప్రవేశ పెట్టనున్నట్లు సంస్థ ప్రకటించింది.

Ola Electric Scooter
పది రంగుల్లో ఓలా స్కూటర్​
author img

By

Published : Jul 22, 2021, 5:36 PM IST

దేశీయ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా.. ఎలక్ట్రిక్ స్కూటర్ల వ్యాపారానికి సంబంధించి మరో కీలక ప్రకటన చేసింది. తాము తీసుకువస్తున్న స్కూటర్​ను పది రంగుల్లో మార్కెట్​లోకి విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు గురువారం ఓ ప్రకటనను విడుదల చేసింది.

Ola Electric Scooter
తెలుపు రంగులో ఓలా స్కూటర్​
Ola Electric Scooter
పసుపు రంగులో ఓలా స్కూటర్​

ఓలా స్కూటర్​ రంగులు ఇలా..

  • నలుపు (మ్యాట్​, గ్లాస్​ ఫినిషింగ్​)
  • నీలం (మ్యాట్​, గ్లాస్​ ఫినిషింగ్​)
  • ఎరుపు
  • పింక్​
  • పసుపు
  • తెలుపు
  • సిల్వర్​
    Ola Electric Scooter
    ఎరుపు రంగులో ఓలా స్కూటర్​

వీటితో పాటు మరో రంగుపై సంస్థ ప్రకటించాల్సి ఉంది. ఇటీవల ఈ స్కూటర్​ బుకింగ్స్​ ప్రారంభమైన 24 గంటల్లోనే లక్ష మంది బుక్​ చేసుకోవడం విశేషం.

Ola Electric Scooter
పింక్​ రంగులో ఓలా స్కూటర్​

ఓలా స్కూటర్​ అందుబాటులోకి రానున్న రంగులకు సంబంధించిన ఓ టీజర్​ను ఓలా ఎలక్ట్రిక్​ యూట్యూబ్​లో పెట్టింది. దీనిలో స్కూటర్ రూపకల్పను వివరించింది.

Ola Electric Scooter
ఓలా స్కూటర్​ చార్జింగ్​ సెటప్​

"ఓలా స్కూటర్ వినియోగదారులకు గొప్ప స్కూటర్ అనుభవాన్ని ఇస్తుంది. క్లాస్ లీడింగ్ స్పీడ్, వైడ్​ రేంజ్​, బూట్ స్పేస్, గ్లోబల్ డిజైన్​లు వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఈ స్కూటర్​ సొంతం. అంతేగాక ఎక్కువమంది దీనిని కొనుగోలు చేయగలిగేలా ధరలో ఇది అందుబాటులో ఉంటుంది."

- ఓలా ఎలక్ట్రిక్​​

ఓలా స్కూటర్​ గురించి మరిన్ని అంశాలు..

  1. ఓలా స్కూటర్​ ధరను కంపెనీ ఇంకా నిర్ణయించలేదు. ప్రాథమిక అంచనాలు ప్రకారం సుమరుగా రూ.80వేల నుంచి రూ. లక్ష వరకూ ఉండొచ్చని అంచనా.
  2. గతవారం ఈ స్కూటర్​కు సంబంధించి రూ.499తో ఆన్​లైన్​ రిజర్వేషన్లు ప్రారంభమయ్యాయి. రిజిస్ట్రేషన్​ ఫీజ్​ వాపసు ఇచ్చేస్తారు.
  3. ఆన్​లైన్​ ద్వారా బుక్​ చేసుకున్న వారికి సంస్థ స్కూటర్​లను డోర్​ డెలివరీ ఇవ్వనుంది.
  4. ఈ స్కూటర్లు అన్నీ తమిళనాడులోని ఓలా ఫ్యూచర్​ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు.
  5. మొదటిదశలో భాగంగా ఏడాదికి 20 లక్షల స్కూటర్లను తయారు చేస్తామని సంస్థ ఇప్పటికే ప్రకటించింది. వచ్చే ఏడాదికి ఈ సంఖ్య కోటికి చేరవచ్చని అంచనా.
  6. రుణ సదుపాయం కోసం ఓలా ఎలక్ట్రిక్ పదేళ్ల కాలానికి బ్యాంక్​ ఆఫ్​ బరోడాతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇదీ చూడండి:

ఓలా ఈ- స్కూటర్.. రంగు అదుర్స్​!

ఓలా ఎలక్ట్రిక్​ స్కూటర్​ బుకింగ్స్ షురూ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.