భారత బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉన్నట్లు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) మరో సారి స్పష్టం చేసింది. బ్యాంకులు సంక్షోభంలో ఉన్నట్లు వస్తున్న వార్తలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదని భరోసా ఇచ్చింది.
పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో-ఆపరేటివ్ బ్యాంకు సంక్షోభం కారణంగా.. దేశంలోని ఇతర బ్యాంకుల పరిస్థితిపై వదంతులు వ్యాపించాయి. ఫలితంగా నిఫ్టీ బ్యాంక్ 1.30 శాతం నష్టపోయింది. ఈ పరిణామాలన్నింటి దృష్ట్యా ఆర్బీఐ తాజా ప్రకటన చేసింది.
ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితుల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీలో బ్యాంకింగ్ రంగ షేర్లు కుదేలయ్యాయి.
ముఖ్యంగా ఎస్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, ఐడీఎఫ్సీ ఫస్ట్, పంజాబ్ నేషనల్ బ్యాంకులు భారీ నష్టాలను నమోదు చేశాయి.
ఇదీ చూడండి: భారత్కు శాంసంగ్ మడత ఫోన్- ధరెంతో తెలిస్తే షాక్!