విదేశీ ఈ-కామర్స్ సంస్థలకు కేంద్రం ఊరట కల్పించింది. ఆయా సంస్థలకు చెందిన భారతీయ విభాగాల ద్వారా చేసే వస్తు, సేవల విక్రయాలపై 2 శాతం డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విధించరాదని నిర్ణయించింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం.
ఫినాన్స్ బిల్ 2021లో సవరణల ప్రకారం.. విదేశీ ఈ-కామర్స్ సంస్థలు భారత్‌లో శాశ్వత విభాగాన్ని కలిగి ఉండి, ఆదాయపు పన్ను చెల్లిస్తుంటే.. ఆయా కంపెనీలు 2 శాతం డిజిటల్ సుంకం చెల్లించాల్సిన అవసరం లేదు. భారత్‌లో ఎలాంటి పన్నులు చెల్లించని విదేశీ కంపెనీలు మాత్రం 2 శాతం డిజిటల్ ట్యాక్స్ చెల్లించాల్సిందే.
డిజిటల్ ట్యాక్స్‌ను ఏప్రిల్ 2020లో తీసుకొచ్చింది కేంద్రం. ఇది రూ.2 కోట్ల కన్నా ఎక్కువ ఆదాయాన్ని గడించే విదేశీ కంపెనీలకు వర్తిస్తుంది. విదేశీ సంస్థలు చేసే ఆన్లైన్ వస్తు సేవల విక్రయాలు కూడా దీని పరిధిలోకి వస్తాయి.
ఇదీ చదవండి:వన్‌ప్లస్ 9 ఫోన్స్, స్మార్ట్‌వాచ్ ధరలు, ఫీచర్లు ఇవే..